వాడు చచ్చాడు..! మహిళను 59 ముక్కలుగా నరికిన నిందితుడు ఆత్మహత్య..!
మహాలక్ష్మి దారుణ హత్య ఘటన బెంగళూరు నగరవాసులను ఉలిక్కిపడేలా చేసింది.

Bengaluru Fridge Horror Case (Photo Credit : Google)
Bengaluru Fridge Horror Case : బెంగళూరుకు చెందిన మహాలక్ష్మి హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. మహాలక్ష్మి దారుణ హత్యకు గురైంది. నిందితుడు ఆమెను 59 ముక్కలు నరికాడు. శరీర భాగాలను ఫ్రిడ్జిలో దాచాడు. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఈ కేసులో బిగ్ ట్విస్ట్ చేసుకుంది. ఈ కేసులో నిందితుడు ముక్తి రంజన్ ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు అతడి కోసం ఒడిశా వెళ్లి ముమ్మరంగా గాలిస్తుండగా.. కూలేపాడులో ఉరి వేసుకున్నాడు.
కాగా, మహాలక్ష్మి పని చేస్తున్న మాల్ లో టీమ్ హెడ్ గా పని చేస్తున్న ముక్తి రంజన్ ప్రతాప్ రాయ్.. కొంతకాలంగా ఆమెతో రిలేషన్ లో ఉన్నాడు. అయితే, మహాలక్ష్మి మరో వ్యక్తితో చనువుగా ఉంటోందని, అది నచ్చకనే ఆమెను కిరాతకంగా చంపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ‘మహాలక్ష్మి కేసులో ముక్తి రంజన్ రాయ్ నిందితుడిగా ఉన్నాడు. అతడిని పట్టుకునేందుకు పోలీసులు వెళ్లారు. అయితే, ఒడిశాలోని భదక్ జిల్లాలో రంజన్ చెట్టుకి ఉరేసుకున్నాడు’ అని పోలీసులు తెలిపారు.
మహాలక్ష్మి దారుణ హత్య ఘటన బెంగళూరు నగరవాసులను ఉలిక్కిపడేలా చేసింది. ఆమెను అత్యంత కిరాతకంగా చంపాడు. హత్య తర్వాత మృతదేహాన్ని 59 ముక్కలుగా నరికాడు. అనంతరం శరీర భాగాలను ఫ్రిడ్జిలో దాచాడు. అయితే, ఇంట్లో నుంచి దుర్వాసన వస్తుండటంతో స్థానికులు పోలసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు ఇంట్లోకి వెళ్లి చూసి షాక్ అయ్యారు. ఫ్రిడ్జిలో శరీర భాగాలు గుర్తించి విస్తుపోయారు. ఈ ఘటన స్థానికులను భయాందోళనకు గురించి చేసింది. 2022లో ఢిల్లీలో జరిగిన మరో దారుణాన్ని గుర్తు చేసింది. ఢిల్లీలో శద్రా వాకర్ ను ఆమె బాయ్ ఫ్రెండ్ అత్యంత కిరాతంగా చంపాడు. అనంతరం మృతదేహాన్ని ముక్కలుగా నరికాడు. అచ్చం అదే రీతిలో మహాలక్ష్మి ఘటన చోటు చేసుకుంది.
భర్త నుంచి విడిపోయిన మహాలక్షి.. బెంగళూరులోని వ్యాలికావల్ లో ఒంటరిగా నివాసం ఉంటోంది. ఆమె ఓ మాల్ లో పని చేస్తుంది. ఉదయం డ్యూటీకి వెళ్తే తిరిగి వచ్చేది రాత్రికే. అయితే, అదే మాల్ లో పని చేసే టీమ్ హెడ్ రాయ్ తో రిలేషన్.. మహాలక్ష్మి ప్రాణం పోవడానికి కారణమైంది.
Also Read : సంచలనం రేపిన రాములోరి రథం దహనం కేసు.. నిప్పు పెట్టింది ఇతడే, ఎందుకో చెప్పిన పోలీసులు..