హామీ ఇస్తున్నా : ఆపదలో ఉన్నామని ఫోన్ చేస్తే…7సెకండ్లలోనే రెస్పాన్స్

ఆపదలో ఉన్నామని ఎవరైనా ఫోన్ కాల్ చేస్తే కేవలం ఏడు సెకండ్లలోనే తాము స్పందించడం జరుగుతుందని బెంగళూరు సిటీ పోలీస్ చీఫ్ అన్నారు. తెలంగాణలో జరిగిన దిశ హత్యాచార ఘటన అనంతరం దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున మహిళల భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్న సమయంలోబెంగళూరు పోలీస్ కమిషనర్ భాస్కర్ రావు ఈ వ్యాఖ్యలు చేశారు.
బెంగళూరులోని నివసించే ప్రతి ఒక్కరూ,అలాగే సిటీకి వచ్చే ఎవ్వరైనా సరే భద్రత విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని,భద్రత కల్పించడం తమ బాధ్యత అని భాస్కర్ రావు తెలిపారు. మహిళలకు భద్రత కల్పిస్తామని 100 శాతం హామీ ఇస్తున్నామని, ఆపద అని ఎవరైనా ఫోన్ చేస్తే ఏడు సెకండ్లలోనే రిప్లై ఇవ్వబడుతుందని,అంతేకాకుండా ఎస్ఎమ్ఎస్ లు కూడా పంపించడం జరుగుతుందని ఆయన తెలిపారు.