Ruby Asif Khan: ఇంట్లో నవరాత్రి ఉత్సవాలు చేపట్టిన ముస్లిం మహిళ.. చంపేస్తామంటూ బెదిరింపులు
తాజా బెదిరింపులతో పోస్టర్లు, కరపత్రాలు వేశారు. హిందూ సంప్రదాయాలకు అనుగుణంగా పూజలు చేసిన కాఫీర్ అంటూ ఆమె, ఆమె కుటుంబాన్ని సజీవంగా దహనం చేస్తామని పోస్టర్లలో బెదిరించారు. రూబీ రెండేళ్ల క్రితం కూడా గణేశ్ విగ్రహాన్ని ప్రతిష్ఠించి నరోరా ఘాట్ వద్ద నిమజ్జనం చేశారు. రెండేళ్ల క్రితం కూడా రూబీ ఖాన్ తన ఇంట్లో రాం దర్బార్ నిర్వహించారు.

BJP leader Ruby Asif Khan receives threats for installing Mata Rani idol at home
Ruby Asif Khan: నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా భారతీయ జనతా పార్టీకి చెందిన ఒక ముస్లిం నాయకురాలు తన ఇంట్లో దుర్గాదేవి విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు చేస్తున్నారు. అయితే ఆమె ఇస్లాం మతానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ ఆమెను హతమారుస్తామంటూ బెదిరింపులు వస్తున్నాయి. ఆమెను చంపేస్తామంటూ బహిరంగంగా పోస్టర్లు, కరపత్రాలు వెలుస్తున్నాయి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అలీఘడ్ నగర నివాసి అయిన బీజేపీ నాయకురాలు రూబీ అసిఫ్ ఖాన్ తన ఇంట్లో దుర్గాదేవి విగ్రహాన్ని ప్రతిష్ఠించి కుటుంబసభ్యులతో కలిసి పూజలు చేశారు. తొమ్మిది రోజుల పాటు ఈ ఉత్సవాలు చేయాలని ఆమె నిర్ణయించుకున్నారు.
కాగా, తాజా బెదిరింపులతో పోస్టర్లు, కరపత్రాలు వేశారు. హిందూ సంప్రదాయాలకు అనుగుణంగా పూజలు చేసిన కాఫీర్ అంటూ ఆమె, ఆమె కుటుంబాన్ని సజీవంగా దహనం చేస్తామని పోస్టర్లలో బెదిరించారు. రూబీ రెండేళ్ల క్రితం కూడా గణేశ్ విగ్రహాన్ని ప్రతిష్ఠించి నరోరా ఘాట్ వద్ద నిమజ్జనం చేశారు. రెండేళ్ల క్రితం కూడా రూబీ ఖాన్ తన ఇంట్లో రాం దర్బార్ నిర్వహించారు. గతంలో రూబీకి ఫత్యా జారీ చేశారు. ఈ బెదిరింపులపై రూబీ అసిఫ్ ఖాన్ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, పోలీసులు, అధికారులకు ఫిర్యాదు చేశారు. తన కుటుంబం హిందూ ముస్లిం ఐక్యత కోసం పాటుపడుతుందని, కాని తమను బెదిరిస్తున్నారని రూబీ భర్త ఆసిఫ్ ఖాన్ చెప్పారు. రాజ్యాంగం ప్రకారం ఎవరైనా ఏ దేవుడిని అయినా పూజించవచ్చని వ్యాఖ్యానించారు.