ఈస్టర్ వేడుకల్లో విషాదం : శ్రీలంకలో వరుస పేలుళ్లు.. 26 మంది మృతి

ఈస్టర్ పర్వదినం సందర్భంగా విషాదం నెలకొంది. ఉగ్రవాదులు ఈస్టర్ వేడుకలను టార్గెట్ చేశారు. శ్రీలంకలో వరుస బాంబు పేలుళ్లు సంభవించాయి. కొలంబోలోని ఐదు చర్చీలు, రెండు ఫైవ్ స్టార్ హోటల్స్ లో పేలుళ్లు సంభవించాయి. ఈస్టర్ వేడుకల్లో ఘటన చేసుకుంది. వరుసగా నాలుగు బాంబులు పేళాయి. ఈ ఘటనలో 26 మంది మృతి చెందారు. మరో 160 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. వీరిలో 30 మంది పరిస్థితి విషమంగా ఉంది.
కొలంబోలోని కొచ్చికోడ్ ప్రాంతంలో ప్రముఖ సెయింట్ ఆంటోని చర్చితో పాటు కటువాపిటియాలోని మరో చర్చిలోనూ పేలుళ్లు సంభవించాయి. అలాగే శాంగ్రిలా, కింగ్స్‌బరి హోటల్‌లోనూ బాంబులు పేలినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో పలు చర్చిలు ధ్వంసమయ్యాయి. పేలుళ్లు జరిగిన చోట్ల మృతదేహాలు చెల్లాచెదురుగా పడిఉన్నాయి. క్షతగాత్రలను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. గాయపడినవారిలో విదేశీ టూరిస్టులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
ఈస్టర్ వేడుకలు జరుపుకునేందుకు క్రిస్టియన్స్ భారీగా చర్చీలకు చేరుకున్నారు. ప్రార్థనలు చేస్తున్న సందర్భంగా పేలుళ్లు సంభవించాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు, ఆర్మీ ఘటనాస్థలికి చేరుకున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనకు సంబంధించి శ్రీలంక ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికార ప్రకటన రాలేదు. అయితే ఏ ఉగ్రవాద సంస్థ కూడా బాంబు పేలుళ్లకు పాల్పడినట్లు ప్రకటించలేదు.