శుభకార్యం జరగాల్సిన ఇంట్లో విషాదం : వేడి పాలలో పడి బాబు మృతి

అనంతపురం జిల్లా పెద్దపప్పూరు గ్రామంలో విషాదం జరిగింది. వేడి పాల గిన్నెలో పడి బాబు మృతి చెందాడు. గ్రామంలోని సుంకులమ్మ కాలనీలో నివాసం ఉండే లోకేశ్వరయ్య, చంద్రిక

  • Published By: veegamteam ,Published On : September 9, 2019 / 03:37 AM IST
శుభకార్యం జరగాల్సిన ఇంట్లో విషాదం : వేడి పాలలో పడి బాబు మృతి

Updated On : September 9, 2019 / 3:37 AM IST

అనంతపురం జిల్లా పెద్దపప్పూరు గ్రామంలో విషాదం జరిగింది. వేడి పాల గిన్నెలో పడి బాబు మృతి చెందాడు. గ్రామంలోని సుంకులమ్మ కాలనీలో నివాసం ఉండే లోకేశ్వరయ్య, చంద్రిక

అనంతపురం జిల్లా పెద్దపప్పూరు గ్రామంలో విషాదం జరిగింది. వేడి పాల గిన్నెలో పడి బాబు మృతి చెందాడు. గ్రామంలోని సుంకులమ్మ కాలనీలో నివాసం ఉండే లోకేశ్వరయ్య, చంద్రిక దంపతులకు ఇద్దరు కుమారులు. వీరిలో చిన్నవాడు దేవాన్ష్. వయసు 18 నెలలు. ఆదివారం(సెప్టెంబర్ 9,2019) లోకేశ్వరయ్య ఇంట్లో శుభకార్యం ఉంది. ఇందుకోసం పెరుగు కావాల్సి వచ్చింది. శనివారం(సెప్టెంబర్ 8,2019) రాత్రి పాలను వేడి చేసి గిన్నెలో పోశారు. వాటిని చల్లార్చేందుకు ఫ్యాన్ కింద ఉంచారు. అదే సమయంలో దేవాన్ష్ ఆడుకుంటూ అటుగా వచ్చాడు. ఆడుకుంటూ వెళ్లి పాల గిన్నెలో పడిపోయాడు. వేడి వేడి పాలు కావడంతో దేవాన్ష్ తీవ్రంగా గాయపడ్డాడు. శరీరం కాలిపోయింది. వెంటనే దేవాన్ష్ ని కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం అనంతపురం ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ ప్రాథమిక చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం కర్నూలుకి తరలిస్తుండగా దారిలోనే చనిపోయాడు. ఊహించని విధంగా ప్రమాదం జరగడం, బాబు చనిపోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటనతో స్థానికంగా విషాదచాయలు అలుముకున్నాయి. అయ్యో పాపం ఎంత ఘోరం జరిగింది అని గ్రామస్తులు కన్నీటిపర్యంతమయ్యారు.

దేవాన్ష్ ముద్దులొలికే ముఖంతో.. బుడి బుడి అడుగుల వేసుకుంటూ.. కేరింతలు కొడుతూ తిరుగుతుంటే ఆ ఇంట రోజూ పండగలా ఉండేది. అలాంటి ఇంట్లో ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. దేవాన్ష్ ఇక లేడు వార్తను జీర్ణించుకోలేకపోతున్నారు. పిల్లలు ఉన్న ఇంట్లో తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వారిని ఓ కంట కనిపెట్టాల్సిన ఉంది. చిన్నపాటి నిర్లక్ష్యానికి భారీ మూల్యం చెల్లించుకోకతప్పదు.