పెళ్లి చేసుకుంటానని చెప్పి యువతిపై బీటెక్ విద్యార్ధి అత్యాచారం

పెళ్లి చేసుకుంటానని చెప్పి యువతిపై బీటెక్ విద్యార్ధి అత్యాచారం

Updated On : February 21, 2021 / 11:47 AM IST

Btech Student Raped on B.com student pretext of marriage : డిగ్రీ చదువుతున్న యువతిని పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి బీటెక్ విద్యార్ధి  అత్యాచారం చేసిన ఘటన హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్  పరిధిలో జరిగింది.

హైదరాబాద్ రహమత్ నగర్ సమీపంలోని కార్మికనగర్ లో నివసించే విద్యార్ధిని(23) బీకాం చదువుతోంది. అదే ప్రాంతానికి చెందిన బీటెక్ చదివే విద్యార్ధి రాజు (23) అమెను పెళ్లి చేసుకుంటానని ప్రపోజల్ చేశాడు.

పెళ్లి విషయం మాట్లాడటానికి ఇంటికి  రమ్మని పిలిచి ఆమెపై అత్యాచారం చేశాడు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుతో జూబ్లీ హిల్స్ పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.