అల్లుడిని చంపించిన అత్త.. పోలీసుల విచారణలో విస్తుపోయే విషయాలు

మల్కాపురం ప్రాంతానికి చెందిన దాడి సూర్య కిరణ్ (25) క్యాబ్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. భార్య మేఘన ఆడ బిడ్డకు జన్మనివ్వడంతో..

brutally murdered

Visakhapatnam : విశాఖపట్టణంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. అత్త, అల్లుడికి మధ్య ఘర్షణ తలెత్తడంతో తనకు సన్నిహితంగా ఉండే వ్యక్తితో విషయాన్ని చెప్పి అల్లుడిని అత్త చంపించింది. విశాఖ నగర పరిధి అగనంపూడి సమీపంలోని హనుమాన్ కూడలి వద్ద సోమవారం అర్థరాత్రి ఈ దారుణ హత్య జరిగింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి.

Also Read : బల్కంపేట ఆలయం వద్ద తోపులాట.. మేయ‌ర్‌కు గాయాలు.. 10టీవీ ప్రతినిధిపై పోలీసుల దురుస ప్రవర్తన

మల్కాపురం ప్రాంతానికి చెందిన దాడి సూర్య కిరణ్ (25) క్యాబ్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. తండ్రి భాస్కరరావు మృతి చెందగా.. తల్లి పద్మ, తమ్ముడు ప్రసాద్ తో కలిసి ఉండేవాడు. రెండేళ్ల క్రితం గాజువాక దరి శ్రీనగర్ కు చెందిన మేఘనను ప్రేమించి వివాహం చేసుకున్నాడు. అయితే, మేఘన తల్లి సుజాతకు ఈ వివాహం ఇష్టం లేదు. మేఘన తండ్రి రామారావు గతంలోనే చనిపోయాడు. రామారావు చనిపోయిన కొద్దికాలంకు కొర్లయ్య అనే వ్యక్తితో సుజాత సన్నిహితంగా ఉంటుంది. ఈ విషయంపై తల్లీ, కూతురు మధ్య పలు సందర్భాల్లో గొడవలు జరిగాయి. తల్లీ, కూతురు మధ్య గొడవలు పెద్దవి అవుతుండటంతో సూర్య కిరణ్ తన భార్య మేఘనను తీసుకొని హైదరాబాద్ లో కాపురం పెట్టాడు. మేఘన గర్భందాల్చడంతో ప్రసవం చేయించేందుకు ఇటీవల నగరానికి తీసుకొచ్చి అగనంపూడి ప్రాంతీయ ఆసుపత్రిలో చేర్పించాడు.

Also Read : ఫుట్‌బాల్ స్టార్‌ మెస్సీ బాడీగార్డ్ గతంలో ఏం చేసేవాడో తెలుసా? వీడియోలు చూస్తే ఫిదా అవ్వాల్సిందే

మేఘన ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. ఆమెను చూసేందుకు తల్లి సుజాత సోమవారం ఆస్పత్రికి రావడంతో సూర్య కిరణ్ అడ్డుకున్నాడు. ఈ క్రమంలో అత్తా, అల్లుడికి మధ్య గొడవ జరిగింది. ఆ తరువాత అక్కడి నుంచి వెళ్లిపోయిన సుజాత.. ఆస్పత్రి వద్ద జరిగిన విషయాన్ని తను సన్నిహితంగామెలిగే కొర్లయ్యకు చెప్పింది. ఆగ్రహంతో ఊగిపోయిన కొర్లయ్య సోమవారం అర్థరాత్రి మాటువేసి ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళ్తున్న సూర్యకిరణ్ పై దాడి చేశాడు. సూర్యకిరణ్ కు తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మరణించాడు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

 

ట్రెండింగ్ వార్తలు