ఫుట్‌బాల్ స్టార్‌ మెస్సీ బాడీగార్డ్ గతంలో ఏం చేసేవాడో తెలుసా? వీడియోలు చూస్తే ఫిదా అవ్వాల్సిందే

ప్రపంచ ప్రఖ్యాత ఫుట్‌బాల్ ఆటగాడు లియోనెల్ మెస్సీ గురించి ఫుట్‌బాల్ క్రీడపై అవగాహన ఉన్న ప్రతిఒక్కరికి తెలిసేఉంటుంది..

ఫుట్‌బాల్ స్టార్‌ మెస్సీ బాడీగార్డ్ గతంలో ఏం చేసేవాడో తెలుసా? వీడియోలు చూస్తే ఫిదా అవ్వాల్సిందే

Lionel Messi Bodyguard

Updated On : July 9, 2024 / 11:59 AM IST

Lionel Messi Bodyguard : ప్రపంచ ప్రఖ్యాత ఫుట్‌బాల్ ఆటగాడు లియోనెల్ మెస్సీ గురించి ఫుట్‌బాల్ క్రీడపై అవగాహన ఉన్న ప్రతిఒక్కరికి తెలిసేఉంటుంది. ఫుట్‌బాల్ ప్లేయర్ క్రిస్టియానో రోనాల్డో, లియోనెల్ మెస్సి సమఉజ్జీలుగా ఉంటారు. క్రిస్టియానో తరహాలో మెస్సీకి ఫ్యాన్స్ ఫాలోయింగ్ విపరీతంగా ఉంటుంది. మెస్సి కనిపించాడంటే ఫ్యాన్స్ అతని ఆటోగ్రాఫ్ కోసం, అతనితో షెక్ హ్యాండ్ ఇచ్చేందుకు పోటీపడుతుంటారు. అయితే, మెస్సి దరిదాపుల్లోకి వెళ్లాలంటే అతని బాడీగార్డ్ యాస్సిన్ చూకోను దాటుకొని వెళ్లాల్సిందే. అతన్ని దాటుకొని మెస్సి దగ్గరకు చేరడం ఫ్యాన్స్ కు దాదాపు అసాధ్యమనే చెప్పొచ్చు. ఎందుకంటే.. మెస్సీకి రక్షణ కల్పించే విషయంలో చూకో ఎప్పుడూ అలర్ట్ గా ఉంటాడు.

Also Read : Mumbai rain : ముంబైలో భారీ వర్షాలు.. 24గంటల పాటు రెడ్ అలర్ట్.. 50కిపైగా విమానాలు రద్దు

ప్రపంచంలో మామూలు క్రీడల్లో రాణించే ఆటగాళ్లకే ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంటుంది.. అలాంటిది ప్రపంచంలో ఎక్కువ క్రీడాభిమానులు కలిగిన ఫుట్ బాల్ స్టార్ లియోనెల్ మెస్సీ లాంటి ఆటగాళ్లకు విపరీతమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంటుంది. ఈ క్రమంలో మెస్సీ మైదానంలో ఉన్న సమయంలోనూ, బయట అతనితో షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు, అతనితో సెల్ఫీ దిగేందుకు ఫ్యాన్స్ పరుగులు పెట్టుకుంటూ వస్తారు. వారిని మెస్సీ దారిదాపుల్లోకి చేరకుండా యాస్సిన్ చూకో రక్షణ కల్పిస్తుంటారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు యాస్సిన్ చూకో పట్ల ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

Also Read : అలా చేయాలని చూస్తే.. టీడీపీ గల్లంతయ్యే అవకాశం ఉంది- విజయశాంతి వార్నింగ్

ఎవరీ యాస్సిన్ చూకో..?
లియోనెల్ మెస్సీకి బాడీగార్డుగా ఉన్న యాస్సిన్ చూకో ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్ లలో నేవీ సీల్ గా పనిచేసిన మాజీ యూఎస్ సైనికుడు. ఇంటర్ మయామి క్లబ్ ప్రెసిడెంట్ డేవిడ్ బెక్ హాం వ్యక్తిగత సిఫార్సును అనుసరించి మెస్సీకి బాడీగార్డుగా చూకో నియమించబడ్డాడని నివేదికలు పేర్కొంటున్నాయి. మైదానం బయట, మైదానం లోపల ఆటఆడే సమయంలోనూ ఆకతాయి ఫ్యాన్స్ నుంచి లియోనెల్ మెస్సీకి రక్షణ కల్పిస్తుంటాడు. మెస్సీ దగ్గరకు వెళ్లేందుకు ప్రయత్నించిన వారిని అడ్డుకుంటూ మెస్సీకి రక్షణ కవచంగా ఉంటాడు. అతని ఇన్ స్టాగ్రామ్ లో 7,68,000 ఫాలోవర్స్ ను కలిగి ఉన్నారు. అతను తరచూ తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో బాక్సింగ్, మార్షల్ ఆర్ట్స్ శిక్షణ నియామకాలను వివరించే వీడియోలను పంచుకుంటాడు. చూకో అనేక ఎంఎంఏ మ్యాచ్ లలోనూ పాల్గొన్నాడు.

 

Messi’s bodyguard
byu/Efficient_Sky5173 ininterestingasfuck

 

View this post on Instagram

 

A post shared by ???? ??????? ????? (@luanchileno)