బల్కంపేట ఆలయం వద్ద తోపులాట.. మేయ‌ర్‌కు గాయాలు.. 10టీవీ ప్రతినిధిపై పోలీసుల దురుస ప్రవర్తన

బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్ లో ప్రోటోకాల్ రగడ నెలకొంది. ప్రోటోకాల్ పాటించడం లేదని మంత్రి పొన్నం ప్రభాకర్, మేయర్ గద్వాల విజయలక్ష్మీ గుడి ముందు బైఠాయించారు.

బల్కంపేట ఆలయం వద్ద తోపులాట.. మేయ‌ర్‌కు గాయాలు.. 10టీవీ ప్రతినిధిపై పోలీసుల దురుస ప్రవర్తన

balkampeta ellamma kalyanam

balkampeta ellamma kalyanam : కొలిచిన వారికి కొంగు బంగారంగా విరాజిల్లుతున్న బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కల్యాణ వేడుకలు కొనసాగుతున్నాయి. అమ్మవారికి ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలను మంత్రి కొండా సురేఖ సమర్పించారు. ఉదయం 11.34 నిమిషాలకు ముఖ నక్షత్రయుక్త అభిజిత్ లగ్నం సుమూహర్తమున వైభవంగా కల్యాణం నిర్వహించారు. అమ్మవారి కల్యాణాన్ని తిలకించేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. అయితే, అమ్మవారికి ప్రభుత్వం తరపున పట్టువస్త్రాల సమర్పణ సమయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ తోపాటు, మేయర్ గద్వాల విజయలక్ష్మీ ఆలయం వద్దకు చేరుకున్నారు. ఆలయ నిర్వాహకులు, అధికారులు పొన్నం, మేయర్ ను రిసీవ్ చేసుకోవటంలో నిర్లక్ష్యం వహించారు. ఈ సమయంలో స్వల్ప తోపులాట చోటు చేసుకోవటంతో మేయర్ కు స్వల్ప గాయాలయ్యాయి. దీంతో ప్రోటోకాల్ రగడ వివాదం తలెత్తింది. ఆలయ నిర్వాహకులు, అధికారుల తీరుపై ఆగ్రహంతో ఆలయం వద్దనే పొన్నం, మేయర్ బైఠాయించి కొద్దిసేపు నిరసన తెలిపారు. దీంతో ఆలయ చైర్మన్, ఆలయ నిర్వాహకులు అక్కడకు చేరుకొని వారిని సముదాయించి లోపలికి తీసుకెళ్లారు.

Also Read : Bharateeyudu 2 : సీఎం రేవంత్ రెడ్డి దెబ్బకి.. ఆ పని మొదలుపెట్టిన ‘భారతీయుడు 2’ టీమ్..

10టీవీ ప్రతినిధిపై పోలీసుల దురుస ప్రవర్తన..
బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణోత్సవం సందర్భంగా ఏర్పాట్ల విషయంలో నిర్వాహకులు విఫలమయ్యారు. దీంతో భక్తులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వీరితో పాటు మంత్రి పొన్నం ప్రభాకర్, మేయర్ గద్వాల విజయలక్ష్మీకి చేదు అనుభవం ఎదురైంది. పోలీసులు ఓవరాక్షన్ తో మహిళా భక్తులకు ఇబ్బదులు ఎదురయ్యాయి. దర్శనంకు సంబంధించిన టికెట్ ఉన్నప్పటికీ భక్తులను లోపలికి వెళ్లనివ్వకుండా పోలీసులు అడ్డుకున్నారు. అమ్మవారి కల్యాణోత్సవం కవరేజ్ లో పాల్గొన్న 10టీవీ ప్రతినిధి పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. పోలీసుల తీరుతో ఇబ్బంది ఎదుర్కొన్న 10టీవీ ప్రతినిధిని పొన్న ప్రభాకర్, మేయర్ గద్వాల విజయలక్ష్మీ పిలిపించుకొని మాట్లాడారు. దురుసుగా ప్రవర్తించిన పోలీసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. మరోవైపు.. పోలీసుల ఓవరాక్షన్ పై మంత్రి కొండా సురేఖ స్పందించారు. మీడియా ప్రతినిధి పట్ల దురుసగా ప్రవర్తించిన వారిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Also Read : Gold Rate : మహిళలకు గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధర.. తెలుగు రాష్ట్రాల్లో తులం గోల్డ్ రేటు ఎంతో తెలుసా?