Actress Mira Mithun : నటి మీరామిథున్‌పై మరోసారి అరెస్ట్ వారంట్ జారీ

తమిళ సినీనటి మీరా మిథున్ పై చెన్నై ఫాస్ట్ ట్రాక్ కోర్టు అరెస్ట్ వారంట్ జారీ చేసింది.  ఆమెపై కోర్టు అరెస్ట్ వారంట్ జారీ చేయటం ఇది రెండోసారి.

Actress Mira Mithun : నటి మీరామిథున్‌పై మరోసారి అరెస్ట్ వారంట్ జారీ

actress mira mithun

Updated On : August 7, 2022 / 11:54 AM IST

Actress Mira Mithun :  తమిళ సినీనటి మీరా మిథున్ పై చెన్నై ఫాస్ట్ ట్రాక్ కోర్టు అరెస్ట్ వారంట్ జారీ చేసింది.  ఆమెపై కోర్టు అరెస్ట్ వారంట్ జారీ చేయటం ఇది రెండోసారి. బడుగు బలహీన వర్గాలను కించపరుస్తూ సోషల్ మీడియాలో ఆమె వ్యాఖ్యానించారనే ఆరోపణలతో గతేడాది ఆగస్టు 7వ తేదీన డీపీఐ పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి వన్నియరసు గ్రేటర్‌ చెన్నై(Greater Chennai) పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు.

ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు ఆమెపై 7 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఆగస్టు 14న ఆమెను కేరళలో అరెస్ట్ చేసి తమిళనాడు తీసుకు వచ్చారు.ఆమెకు సహకరించిన అంబత్తూరుకు చెందిన అభిషేక్ అనే వ్యక్తిని కూడా అరెస్ట్ చేసి బెయిల్ పై విడుదల  చేశారు. కాగా శనివారం చెన్నైలోని ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ఈ కేసు విచారణ జరిగింది. కేసు విచారణకు మీరా మిథున్ హాజరు కాకపోవటంతో న్యాయమూర్తి అల్లి ఆమెపై రెండో సారి అరెస్ట్ వారంట్ జారీ చేశారు. కేసు తదుపరి విచారణ ఈనెల29కి వాయిదా పడింది.