అడ్డంగా మోసపోయిన హైదరాబాద్ టెకీ : చికెన్ బిర్యానీ ఆర్డర్ ఖరీదు రూ. 50వేలు!

హైదరాబాద్ బిర్యానీ అనగానే ఎవరికైనా నోరు ఊరాలిస్తే. వారంలో ఒక్క రోజు బిర్యానీ తినందే ఊరుకోరు బిర్యానీ ప్రియులు. ఆకలి వేస్తే చాలు వెంటనే బిర్యానీ ఆర్డర్ చేసేస్తుంటారు. ఆన్ లైన్ ఫుడ్ ఆర్డర్ యాప్స్ అందుబాటులోకి రావడంతో మరింత ఈజీ అయిపోయింది. అందరిలానే హైదరాబాద్ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కూడా ఆన్ లైన్ లో ఒక పాపులర్ ఫుడ్ డెలివరీ యాప్ నుంచి చికెన్ బిర్యానీ ఆర్డర్ చేశాడు. రూ.200ల బిర్యానీ ఆర్డర్ చేసిన అతడు భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వచ్చింది.
ఆ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అకౌంట్లో ఒక్కసారిగా రూ.50వేలు మాయమయ్యాయి. బిర్యానీ ఆర్డర్ చేసిన జూబ్లీహిల్స్‌లోని రెహమత్ నగర్‌కు చెందిన టెకీకి సాంబార్ రైస్ ప్యాకెట్ డెలివరీ అయింది. దాంతో అతడు షాక్ అయ్యాడు. ఇంతకీ అతడు చేసిన తప్పు ఒక్కటే.. ఇంటర్నెట్ లో కస్టమర్ కేర్ నెంబర్ నుంచి కాల్ చేయడమే. ఫలితంగా భారీ మొత్తంలో నగదు కోల్పోవాల్సి వచ్చింది. ఫుడ్ ఆర్డర్ చేసిన డెలివరీ యాప్ కస్టమర్ కేర్ నెంబర్ అన్ని అడ్డంగా మోసపోయాడు. కానీ, నిజానికి ఆ కస్టమర్ కేర్ నెంబర్ ఒక ఫిషింగ్ పేజీలో ఉంది. సైబర్ మోసగాళ్లు అతడి అమాయకత్వాన్ని క్యాష్ చేసుకున్నారు.
బిర్యానీ ఆర్డర్ చేస్తే సాంబర్ రైస్ డెలివరీ :
రెండు రోజుల క్రితమే ఈ ఫ్రాడ్ ఎపిసోడ్ మొదలైంది. జోమాటో ఫుడ్ డెలివరీ యాప్ నుంచి చికెన్ బిర్యానీ ఆర్డర్ చేశాడు టెకీ. ఆ తర్వాత అతడికి బిర్యానీకి బదులుగా సాంబర్ రైస్ ప్యాకెట్ డెలివరీ అయింది. వెంటనే అతడు జోమాటో యాప్ కస్టమర్ కేర్ కోసం ఇంటర్నెట్ లో బ్రౌజ్ చేశాడు. అతడికి యాప్ పేరుతో ఒక నెంబర్ కనిపించింది.
ఆ నెంబర్ కు కాల్ చేసి వెంటనే లైన్లోకి వచ్చిన ఆన్ లైన్ మోసగాళ్లు.. రిఫండ్ చేసుకోవాలని సూచించారు. మీకు Paytm అకౌంట్ ఉందా? అని అడిగారు. అతడు ఉంది అనగానే తాము చెప్పినట్టు ఫాలో అవ్వమని సూచించారు. అది నమ్మి అతడు తన పేటీఎం వివరాలు వారికి ఇచ్చాడు. రిఫండ్ ప్రాసెస్ లో అతడికి ‘Proceed to Pay’ అనే మెసేజ్ పంపారు.
అది చూసి తనకు నగదు రిఫండ్ అవుతుందని భావించి దానిపై క్లిక్ చేశాడు. ఇక్కడ ఒక Error సమస్య ఉందని చెప్పి మరోసారి అలానే చేయమన్నారు. ఇలా మూడు సార్లు ఆ మెసేజ్ పై క్లిక్ చేశాడు. అంతే.. పేటీఎం అకౌంటుతో లింక్ అయిన బ్యాంకు అకౌంట్లో నుంచి రూ.50వేల నగదు డెబిట్ అయింది.
తాను మోసపోయిను అని భావించిన హైదరాబాద్ టెకీ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై పోలీసులు.. అనాధికారిక పోర్టల్స్ నుంచి ఎలాంటి ఆర్డర్లు, ట్రాన్సాక్షన్లు చేయరాదని హెచ్చరించారు. సైబర్ క్రైమ్ విభాగం సెక్షన్ 420 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది.