Chit Fund Scam : రూ.100 కోట్లతో తాపీ మేస్త్రీ పరార్.. చిట్టీల పేరుతో ఘరానా మోసం.. వారం గడుస్తున్నా దొరకని ఆచూకీ
పుల్లయ్య అతడి కుటుంబసభ్యుల ఫోన్లు స్విచ్చాఫ్ రావడంతో నిందితుడు బెంగళూరు పారిపోయి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.

Chit Fund Scam : హైదరాబాద్ బీకేగూడలో చిట్టీల పేరుతో మోసానికి పాల్పడ్డ నిందితుడు పుల్లయ్య ఇంకా పరారీలోనే ఉన్నాడు. వారం రోజులు గడుస్తున్నా నిందితుడు ఇంకా ఎక్కడున్నాడో తెలీదు. చిట్టీల పేరుతో 110 కోట్లకుపైగా వసూలు చేశాడు పుల్లయ్య. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు.. పుల్లయ్య కోసం గాలిస్తున్నారు. డబ్బులు కట్టి మోసపోయిన ఇద్దరు మహిళలు బలవన్మరణానికి ప్రయత్నించారు. పుల్లయ్య అతడి కుటుంబసభ్యుల ఫోన్లు స్విచ్చాఫ్ రావడంతో నిందితుడు బెంగళూరు పారిపోయి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.
చిట్టీల డబ్బులతో ఉడాయించిన పుల్లయ్య కోసం ఇంకా గాలింపు కొనసాగుతోంది. ఇప్పటికే బాధితులంతా సీసీఎస్ లో ఫిర్యాదు చేశారు. రూ.110 కోట్ల వ్యవహారం కావడంతో స్థానిక పీఎస్ నుంచి సీసీఎస్ కి కేసుని బదలాయించారు. వారం రోజులు గడుస్తున్నా పులయ్య, అతడి కుటుంబం జాడను కనుగొనలేదు. పులయ్య, అతడి కుటుంబసభ్యుల ఫోన్లు స్విచ్ఛాఫ్ వస్తున్నాయి.
కాల్ డేటా ఆధారంగా పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు. పులయ్య బెంగళూరుకి పారిపోయి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. చిట్టీల రూపంలో జమ చేసిన సొమ్మును రియల్ ఎస్టేట్ లో పెట్టినట్లుగా పోలీసులకు బాధితులు కొంత సమాచారం ఇచ్చారు. పులయ్య బంధువుల సమాచారం సేకరించే పనిలో పోలీసులు ఉన్నారు.
Also Read : ఒక్కొక్కరికి రూ.1.5 లక్షలు.. ఆశా వర్కర్లకు సీఎం చంద్రబాబు వరాలు
పులయ్యది అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం యాడికి మండలం చందన లక్ష్మింపల్లి గ్రామం. 18 ఏళ్ల క్రితం హైదరాబాద్ నగరానికి వచ్చాడు. బీకేగూడ దాసారం బస్తీ సమీపంలోని పూరి గుడిసెలో ఉండే వాడు. పుల్లయ్య కొడుకు తాపీ మేస్త్రీ. కొడుకు దగ్గరే పుల్లయ్య కూలీగా పని చేసేవాడు. ఆ తర్వాత కొంత కాలానికి వ్యాపారం స్టార్ట్ చేశాడు. 50వేలు, రూ.లక్ష, 5లక్షలు, 10 లక్షలు ఇలా రకరకాల చిట్టీలను ప్రారంభించాడు.
స్టార్టింగ్ లో చిట్టీలు పాడుకున్న సభ్యులకు కరెక్ట్ గా డబ్బు చెల్లించేవాడు. దాంతో స్థానికులు అతడిని నమ్మారు. దాదాపు 150 రకాల చిట్టీలను నిర్వహించాడు. ఈ క్రమంలో కొత్త దందాకు తెరలేపాడు పుల్లయ్య. చిట్టీలు పాడుకున్న సొమ్మును తనకిస్తే నెలకు 3 నుంచి 6 శాతం వరకు వడ్డీ ఇస్తానని ఆశ చూపాడు. అంతేకాదు.. చెప్పినట్లుగానే నెల నెల కరెక్ట్ గా వడ్డీ చెల్లించాడు. దాంతో ఇతర ప్రాంతాలకు చెందిన వారు సైతం పుల్లయ్యకు లక్షల రూపాయలు ఇచ్చారు.
Also Read : వైసీపీలో వరుస అరెస్ట్‌లు.. అసలు రీజన్ అదేనా? వైసీపీలో నెక్స్ట్ అరెస్ట్ ఎవరిది?
తొలుత గుడిసెలో ఉన్న పుల్లయ్య.. ఆ తర్వాత భారీ బిల్డింగ్ కట్టుకున్నాడు. అందులో డూప్లెక్స్ భాగాన్ని తన ఇంటిగా ఉంచుకున్నాడు. మిగిలిన అంతస్తుల్లోని గదులను రెంట్ కి ఇచ్చాడు. పుల్లయ్య దగ్గర ఖరీదైన కార్లు కూడా ఉన్నాయి. క్రమంగా అందరి నమ్మకం చూరగొన్న పుల్లయ్య చిట్టీ వ్యాపారం ద్వారా వంద కోట్లు కలెక్ట్ చేశాడు. ఆ తర్వాత అసలు రూపం బయటపెట్టాడు. సడెన్ గా ఓ రోజు ఫ్యామిలీతో కలిసి పరార్ అయ్యాడు. తాము మోసపోయామని తెలుసుకున్న బాధితులు లబోదిబోమంటున్నారు. పుల్లయ్యను నమ్మి సర్వస్వం కోల్పోయామని కన్నీటిపర్యంతం అవుతున్నారు.