JK Terror Attack : జమ్ముూకశ్మీర్‌లో ఆర్మీ వాహనంపై ఉగ్రదాడి.. ఒక పౌరుడు మృతి, ఆరుగురు జవాన్లకు గాయాలు!

JK Terror Attack : వాహనం మారుమూల బోట్‌పత్రి ప్రాంతానికి చేరుకోగానే ఉగ్రవాదులు ఆర్మీ వాహనంపై మెరుపుదాడి చేశారు. ఉగ్రవాదుల దాడికి ప్రతిగా భద్రతా బలగాలు ఎదురుకాల్పులు జరిపాయి. 

JK Terror Attack : జమ్ముూకశ్మీర్‌లో ఆర్మీ వాహనంపై ఉగ్రదాడి.. ఒక పౌరుడు మృతి, ఆరుగురు జవాన్లకు గాయాలు!

Civilian killed, 5 soldiers injured in terror attack on Army vehicle ( Image Source : Google )

Updated On : October 24, 2024 / 9:18 PM IST

JK Terror Attack : జమ్మూకశ్మీర్‌లో ఆర్మీ వాహనంపై ఉగ్రదాడి జరిగింది. గుల్‌మార్గ్‌లోని బోట్‌పత్రి సమీపంలో ఆర్మీ వాహనంపై ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. ఈ ఉగ్రదాడిలో ఒక పౌరుడు మరణించగా, ఆరుగురు సైనికులు గాయపడ్డారని అధికారులు తెలిపారు. వాహనం 18 రాష్ట్రీయ రైఫిల్స్ (RR)కి చెందినది. ఈ వాహనం బోట్‌పత్రి నుంచి మార్గమధ్యలో నియంత్రణ రేఖ (LOC) నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉండగా ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో పోర్టర్‌గా పనిచేస్తున్న ఒక పౌరుడు మృతిచెందాడు.

పాకిస్తాన్ సరిహద్దు యాక్షన్ టీమ్ (BAT)లో ఉగ్రవాదులుగా భావిస్తున్నారు. గతంలో వివిధ సరిహద్దుల్లో కూడా ఈ తరహా దాడులకు పాల్పడినట్టుగా ఇంటెలిజెన్స్ అధికారులు పేర్కొన్నారు. వాహనం మారుమూల బోట్‌పత్రి ప్రాంతానికి చేరుకోగానే ఉగ్రవాదులు ఆర్మీ వాహనంపై మెరుపుదాడి చేశారు. ఉగ్రవాదుల దాడికి ప్రతిగా భద్రతా బలగాలు ఎదురుకాల్పులు జరిపాయి.

ఇటీవల కాశ్మీర్‌లో స్థానికేతర కార్మికులపై దాడులు పెరిగాయి. తాజాగా పుల్వామా జిల్లాలోని త్రాల్ ప్రాంతంలో యూపీకి చెందిన ఓ కూలీపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. మూడు రోజుల క్రితం గందర్‌బాల్ జిల్లాలోని నిర్మాణ స్థలంపై జరిగిన ఉగ్రదాడిలో ఆరుగురు స్థానికేతర కార్మికులు, స్థానిక వైద్యుడు మరణించగా, బీహార్‌కు చెందిన ఒక కార్మికుడు అక్టోబర్ 18న షోపియాన్ జిల్లాలో ఉగ్రవాదుల కాల్పుల్లో మరణించాడు.

Read Also : Viral Video: చిరాకు వచ్చి కార్లను ఫ్లైఓవర్ మీదే వదిలేసి వెళ్లిపోయిన బెంగళూరు వాసులు