Uttar Pradesh: క్లాసులో తిట్టాడని టీచర్‌పై మూడు రౌండ్లు కాల్పులు జరిపిన 10వ తరగతి విద్యార్థి
ఈ కేసుపై ఫిర్యాదు తీసుకుని విచారిస్తు్నట్లు అడిషనల్ సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ రాజీవ్ దీక్షిత్ పేర్కొన్నారు. ఈ ఘనటలో టీచర్ ప్రాణాపాయం లేకుండా బయట పడ్డారని, బుల్లెట్లు శరీరంలోని సున్నిత భాగాలకు తగలకపోవడంతో పెద్దగా ప్రమాదమేమీ జరగలేదని పేర్కొన్నారు. కాగా, టీచర్‌ను ప్రస్తుతం లఖ్‌నవూలోని ఆసుపత్రిలో చికిత్సకు పంపిస్తున్నట్లు పేర్కొన్నారు.

Class 10 Student Shoots Teacher Thrice In UP
Uttar Pradesh: క్లాసులో అందరి ముందు టీచర్ తిట్టాడంతో కోపం పెంచుకున్న 10వ తరగతి చదువుతున్న ఒక విద్యార్థి.. సదరు టీచర్‌పై నాటు తుపాకీతో మూడు రౌండ్లు కాల్పులు జరిపాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్ జిల్లాలో శనివారం జరిగింది. తోటి విద్యార్థితో కాల్పులు జరిపిన విద్యార్థికి తగాదా ఏర్పడింది. ఈ విషయంలో కలుగజేసుకున్న టీచర్.. అందరి ముందు తిట్టాడు. దీనిని అవమానంగా భావించిన ఆ విద్యార్థి.. తీవ్ర అసహనంతో టీచర్‌ను చంపేయాలని నిర్ణయించుకున్నాడు. అనుకున్న ప్రకారం.. టీచర్‌పై కాల్పులు జరిపి అక్కడి నుంచి పారిపోయాడు.
ఈ ఘటన అంతా అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయింది. ఈ కేసుపై ఫిర్యాదు తీసుకుని విచారిస్తు్నట్లు అడిషనల్ సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ రాజీవ్ దీక్షిత్ పేర్కొన్నారు. ఈ ఘనటలో టీచర్ ప్రాణాపాయం లేకుండా బయట పడ్డారని, బుల్లెట్లు శరీరంలోని సున్నిత భాగాలకు తగలకపోవడంతో పెద్దగా ప్రమాదమేమీ జరగలేదని పేర్కొన్నారు. కాగా, టీచర్‌ను ప్రస్తుతం లఖ్‌నవూలోని ఆసుపత్రిలో చికిత్సకు పంపిస్తున్నట్లు పేర్కొన్నారు.
సీసీటీవీ పుటేజీ ప్రకారం.. విద్యార్థి తుపాకీతో టీచర్ వెంట పడుతూ కాల్పులు జరిపాడు. ముందు ప్రాణ భయంతో పరిగెత్తిన టీచర్.. కాసేపటికి వెను తిరిగి విద్యార్థిని నిలువరించే ప్రయత్నం చేశాడు. ఇద్దరి మధ్య కొంత కొట్లాట జరిగింది. సమీపంలోని విద్యార్థులు ఈ దృశ్యాన్ని చూసి వారి దగ్గరకు వచ్చారు. అయితే నిందితుడైన విద్యార్థి తుపాకీ చూపిస్తూ వారిని బెదిరించాడు. ఇంతలో ఒక విద్యార్థి కర్రతో బెదిరించడంతో నిందిత విద్యార్థి తుపాకీ తీసుకుని అక్కడి నుంచి పారిపోయాడు. కాగా, ఈ ఘటనపై గాయపడ్డ టీచర్ స్పందిస్తూ క్లాసులో తిట్టినందుకు విద్యార్థి అంత అసహనానికి గురవుతాడని అనుకోలేదని అన్నారు.
Madhya Pradesh: ప్రభుత్వ అధికారిని స్టేజీపైకి పిలిచి, సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించిన ముఖ్యమంత్రి