వివాదాల్లో సైరా సినిమా : చిరంజీవి, రామ్‌చరణ్‌లపై పోలీసులకు ఫిర్యాదు

మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కతున్న సైరా సినిమాను వివాదాలు చుట్టుముడుతున్నాయి. సైరా హీరో చిరంజీవి, నిర్మాత రామ్‌చరణ్‌లపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి బంధువులు ఫిర్యాదు చేశారు. ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి చరిత్రకు సంబంధించిన ఆధారాలు తీసుకుని డబ్బులు ఇవ్వకుండా మోసం చేశారని అంటున్నారు. న్యాయం చేయమని అడిగేందుకు వెళ్లిన తమపై అక్రమంగా కేసులు పెట్టారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు ఉయ్యాలవాడ బంధువులు.
మెగాస్టార్ చిరంజీవి తన 151వ సినిమాగా ‘రేనాటి సూర్యుడు’ ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి జీవిత కథతో ‘సైరా’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో ఉంది. భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమా వివాదంలో చిక్కుకుంది.