కళ్ల ముందే కాలిపోయాడు : పెట్రోల్ పోసి నిప్పంటించేశారు..

బాలుడిపై పెట్రోల్ పోసి తగుల బెట్టిన ఘటన స్థానికంగా సంచలన సృష్టించింది. శ్రీ పతిభ జూనియర్  కాలేజ్ సమీపంలో ఈ దారుణం జరిగింది.

  • Published By: sreehari ,Published On : December 28, 2018 / 06:35 AM IST
కళ్ల ముందే కాలిపోయాడు : పెట్రోల్ పోసి నిప్పంటించేశారు..

బాలుడిపై పెట్రోల్ పోసి తగుల బెట్టిన ఘటన స్థానికంగా సంచలన సృష్టించింది. శ్రీ పతిభ జూనియర్  కాలేజ్ సమీపంలో ఈ దారుణం జరిగింది.

ఒంగోలు: బాలుడిపై పెట్రోల్ పోసి తగుల బెట్టిన ఘటన స్థానికంగా సంచలన సృష్టించింది. శ్రీ ప్ర‌తిభ జూనియర్  కాలేజ్ సమీపంలో ఈ దారుణం జరిగింది. తమ కళ్ల ఎదురుగానే  మంటల్లో కాలిపోతున్న అబ్బాయిని రక్షంచేందుకు డిసెంబర్ 28వ తేదీ ఉదయం   కాలేజ్ కు వచ్చిన విద్యార్ధులు తీవ్రంగా ప్రయత్నించారు. కానీ ఫలితం లేకపోయింది. అప్పటికే  దాదాపు పూర్తిగా కాలిపోయిన సదరు బాదితుడు గిలగిలా కొట్టుకుంటు మృతి చెందాడు. దీంతో భయాందోళనలకు గురైన విద్యార్ధులు పోలీసులకు సమాచారం అందించగా ఘటనాస్థలికి చేరుకున్న పరిస్థితిని సమీక్షించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

కాగా డిసెంబర్ 27వ తేదీ అర్థరాత్రి తరువాత జరిగినట్లుగా భావిస్తున్న ఈ ఘటనతో ఆ ప్రాంతంలోని కాలేజ్ విద్యార్ధులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. 28వ తేదీ కాలేజ్ ఓపెన్ చేసే సమయం వరకూ బాధితుడు మంటల్లో కాలిపోతున్నాడు అంటే తెల్లవారుఝామునే గుర్తు తెలియని వ్యక్తులు ఈ బాలుడిని చంపేందుకు యత్నించినట్లుగా తెలుస్తోంది. కాగా మృతుడు ఎవరో కూడా ఇంతవరకూ తెలియరాలేదు. మృతుడు ఎవరు? ఎవరైనా బాలుడిని కిడ్నాప్ చేసి తీసుకొచ్చి హత్య చేశారా? లేదా శ్రీ ప్రతిభా కాలేజ్ కు సంబంధించిన విద్యార్ధా అనే విషయం పోలీసు దర్యాప్తులో తేలాల్సి వుంది.