డిసెంబర్ 31 సేఫ్టీ-సెక్యూరిటీ : నిఘా నీడలో నగరం

20 వేల మంది పోలీసులు, 10వేల సీసీ కెమెరాలు, రోజంతా డ్రంకెన్ డ్రైవ్‌లు, షీ టీమ్స్, ట్రాఫిక్ పోలీసులు.. న్యూ ఇయర్‌ వేడుకలకు సంబంధించి హైదరాబాద్ పోలీసులు చేపట్టిన పటిష్టమైన భద్రతా చర్యలు ఇవి.

  • Published By: sreehari ,Published On : December 31, 2018 / 07:18 AM IST
డిసెంబర్ 31 సేఫ్టీ-సెక్యూరిటీ : నిఘా నీడలో నగరం

20 వేల మంది పోలీసులు, 10వేల సీసీ కెమెరాలు, రోజంతా డ్రంకెన్ డ్రైవ్‌లు, షీ టీమ్స్, ట్రాఫిక్ పోలీసులు.. న్యూ ఇయర్‌ వేడుకలకు సంబంధించి హైదరాబాద్ పోలీసులు చేపట్టిన పటిష్టమైన భద్రతా చర్యలు ఇవి.

హైదరాబాద్: 20 వేల మంది పోలీసులు, 10వేల సీసీ కెమెరాలు, రోజంతా డ్రంకెన్ డ్రైవ్‌లు, షీ టీమ్స్, ట్రాఫిక్ పోలీసులు.. న్యూ ఇయర్‌ వేడుకలకు సంబంధించి హైదరాబాద్ పోలీసులు చేపట్టిన పటిష్టమైన భద్రతా చర్యలు ఇవి. న్యూ ఇయర్‌ వేడుకలకు సంబంధించి పోలీసులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ఎలాంటి అపశ్రుతులు, ప్రమాదాలు లేకుండా హ్యాపీగా సెలబ్రేషన్స్ జరుపుకునేలా టైట్ సెక్యూరిటీ అరేంజ్ చేశారు. మనల్ని ఎవరు గమనిస్తారులే అని కుర్రాళ్లు వెర్రి వేషాలు వేస్తే షీ టీమ్స్ తోలు తీస్తాయి. చైన్స్ స్నాచర్లు, క్రిమినల్స్ పని పట్టేందుకు పోలీసులు రెడీగా ఉన్నారు. మందుబాబుల తాట తీసేందుకు డ్రంకెన్ డ్రైవ్‌లు సిద్ధం చేశారు. 2018, డిసెంబర్ 31 రాత్రి నుంచి 2019, జనవరి 1వ తేదీ రాత్రి వరకు నగరం మొత్తం నిఘా నీడలోనే ఉంటుంది.
గీత దాటితే తాట తీస్తారు:
న్యూ ఇయర్ వేడుకల్లో తాగి వాహనాలు నడపడం… ర్యాష్‌ డ్రైవింగ్‌ చేయడంతో ప్రమాదాల బారిన పడే అవకాశముంది. అలాంటి వాటికి ఛాన్స్ లేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. హోటళ్లు, బార్లు, రెస్టారెంట్ల సమీపంలో డ్రంకెన్ డ్రైవ్‌లు ఏర్పాటు చేస్తున్నారు. మందుబాబులు వాహనాలు నడుపుతూ రోడ్లపైకి రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ర్యాష్‌ డ్రైవింగ్‌కు ఆస్కారం లేకుండా ఫ్లైఓవర్లను మూసి వేస్తున్నారు. అతివేగంగా వెళ్లే వాహనాలను గుర్తించి చర్యలు తీసుకునేందుకు ప్రత్యేక బృందాలు రోడ్లపై ఉంటాయి. మరుసటి రోజు కూడా ప్రార్థనల నిమిత్తం జనం వెళుతున్న విషయాన్ని దృష్టిలో పెట్టుకుని చర్చిలు, మసీదులు, మందిరాల వద్ద కూడా భద్రతా చర్యలు చేపడుతున్నారు.
ఒంటి గంట వరకే:
న్యూ ఇయర్‌ వేడుకలను రాత్రి ఒంటి గంటలోపే ముగించాలని హోటల్‌ యాజమాన్యాలకు పోలీసులు ఆదేశాలిచ్చారు. వలంటీర్లు, సెక్యూరిటీ సిబ్బందిని నియమించుకొని ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. హోటళ్ల కెపాసిటీకి మించి జనాన్ని ఆహ్వానించొద్దన్నారు. అశ్లీల డ్యాన్సులకు పర్మిషన్ లేదన్నారు. ప్రతి చోట షీటీం బృందాలు ఉంటాయని, ఎక్కడైనా హద్దు దాటితే చర్యలు తప్పవని హెచ్చరించారు. అంతేకాదు సౌండ్ పొల్యూషన్‌పైనా దృష్టి పెట్టారు. సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్ ప్రకారం 45 డెసిబుల్స్‌ లోపలే స్పీకర్లను వాడాలి. మైనర్లకు మద్యం అమ్మకూడదని చెప్పారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.

See also : న్యూ ఇయర్ కిక్ : మరో డ్రగ్స్ గ్యాంగ్ అరెస్ట్