Cannabis Oil : సికింద్రాబాద్‌లో హ్యాష్ ఆయిల్ ముఠా అరెస్ట్

తెలంగాణలో మాదకద్రవ్యాల రవాణా, వినియోగం పై పోలీసులు ఉక్కుపాదం మోపిన సంగతి తెలిసిందే. తాజాగా పోలీసులు సికింద్రాబాద్ బోయిన పల్లిలో హాష్ ఆయిల్ అమ్మే ముఠాను అరెస్టు చేశారు

Cannabis Oil : సికింద్రాబాద్‌లో హ్యాష్ ఆయిల్ ముఠా అరెస్ట్

Hash Oil

Updated On : April 8, 2022 / 4:13 PM IST

Cannabis Oil :  తెలంగాణలో మాదకద్రవ్యాల రవాణా, వినియోగం పై పోలీసులు ఉక్కుపాదం మోపిన సంగతి తెలిసిందే. తాజాగా పోలీసులు సికింద్రాబాద్ బోయిన పల్లిలో హాష్ ఆయిల్ అమ్మే ముఠాను అరెస్టు చేశారు.
నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి వద్దనుంచి 315 గ్రాముల హాష్ ఆయిల్ స్వాధీనం చేసుకున్నారు.

మేడ్చల్ పోలీసు స్టేషన్ పరిధిలో దూలపల్లిలో ఈరోజు ఉదయం ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసి వారి వద్దనుంచి 14.5 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీరంతా ఒడిషాకు చెందిన వారుగు గుర్తించారు. గంజాయిని వలస కార్మికులకు , విద్యార్ధులకు సరఫరా చేస్తున్నట్లు తెలుసుకున్నారు. గంజాయితో పట్టుబడ్డ ముగ్గురిని పోలీసులు  రిమాండ్‌కు తరలించారు.

ఎల్బీనగర్ ఎస్వోటీ పోలీసులు నిన్న హ్యాష్ ఆయిల్ కలిగి ఉన్న నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. ఈ ముఠా సభ్యుల నుంచి 52 లీటర్ల హ్యాష్ ఆయిల్ ను స్వాధీనం చేసుకున్నారు, ఈ ముఠా విశాఖ నుంచి హైదరాబాద్ మీదుగా ఢిల్లీకి గంజాయి నూనె తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

Also Read : Ukraine Russia War : భారత్‌కు వార్నింగ్ ఇచ్చిన రష్యా