పంజాల్ లో ఘోర ప్రమాదం : బాణాసంచా ట్రాక్టర్ లో పేలుడు..15 మంది దుర్మరణం
పంజాల్ లో ఘోర ప్రమాదం జరిగింది. బాణాసంచా ట్రాక్టర్ లో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 15 మందికి పైగా దుర్మరణం చెందారు.

పంజాల్ లో ఘోర ప్రమాదం జరిగింది. బాణాసంచా ట్రాక్టర్ లో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 15 మందికి పైగా దుర్మరణం చెందారు.
పంజాల్ లో ఘోర ప్రమాదం జరిగింది. బాణాసంచా ట్రాక్టర్ లో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 15 మందికి పైగా దుర్మరణం చెందారు. పలువురు గాయపడ్డారు. బాణాసంచా తీసుకువెళ్తుండగా ఘటన చేటుచేసుకుంది.
బాణాసంచా లోడ్ తో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడడంతో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 15 మంది చనిపోయారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయి.
ఈ ఘటనపై ఎస్ఎస్ పీ స్పందించారు. అంత పెద్ద మొత్తంలో బాణాసంచాను ఎక్కడికి తరలిస్తున్నారు? అనుమతులు ఉన్నాయా లేదా ఆరా తీస్తున్నారు. ఈ ఘటన ఏ విధంగా జరిగిందన్న విషయంపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
మధ్యాహ్నం ఘటన చోటు చేసుకుంది. ఘటన స్థలం నుంచి మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలిస్తున్నారు. బాణా సంచా తరలిస్తున్న ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడటంతో ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
మృతులంతా పంజాబ్ వాసులేనని సమాచారం. ఘటన జరిగినప్పుడు ఎక్కువ మంది ట్రాలీలో ఉండటం, బాణా సంచా పేలుడు తీవ్ర కూడా అధికమొత్తంలో ఉండటంతో పేలుడు ధాటికి 15 మంది ఒక్కసారిగా అక్కడికక్కడే మృతి చెందారు. గాయపడ్డ వారి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయి.
ఘటనపై పూర్తి దర్యాప్తు జరుపుతున్నట్లు పంజాబ్ పోలీసులు చెబుతున్నారు. నిజంగా బాణా సంచా, లేదా ఏదైనా పేలుడు పదార్థాలు తీసుకెళ్తున్నారా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.