Love Affair : విద్యార్ధినిపై ప్రేమోన్మాది కత్తితో దాడి
నల్గోండలో ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. తనను ప్రేమించటం లేదనే కారణంతో సీనియర్ విద్యార్ధినిని, జూనియర్ విద్యార్ధి కత్తితో దాడి చేసి విచక్షణా రహితంగా దాడి చేశాడు.

nalgonda love murder attack
Love Affair : నల్గోండలో దారుణం చోటు చేసుకుంది. ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. తనను ప్రేమించటం లేదనే కారణంతో డిగ్రీ చదువుతున్న సీనియర్ విద్యార్ధినిని, జూనియర్ విద్యార్ధి కత్తితో దాడి చేసి విచక్షణా రహితంగా దాడి చేశాడు. నిందితుడిని ఎన్జీ కాలేజీలో బీబీఏ రెండవ సంవత్సరం చదువుతున్న రోహిత్ (20)గా గుర్తించారు.
గత కొంత కాలంగా రోహిత్, ఒక సీనియర్ విద్యార్ధినిని ప్రేమ పేరుతో వేధిస్తున్నాడని ఆమె తండ్రి తెలిపారు. బాధితురాలితో మాట్లాడాలని ఫారెస్ట్ పార్క్ వద్దకు పిలిచి ఆమెపై కత్తితో దాడిచేశాడు. తీవ్రంగా గాయపడిన బాధితురాలిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నిందితుడు రోహిత్ పై బాధితురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Also Read : Donald Trump on FBI raids: నా ఇంట్లో లాకర్ పగులగొట్టి మరీ తనిఖీలు చేశారు: ట్రంప్