Donald Trump on FBI raids: నా ఇంట్లో లాకర్ పగులగొట్టి మరీ తనిఖీలు చేశారు: ట్రంప్

ఫెడరల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ) అధికారులు ఫ్లోరిడాలోని తన ఇంట్లో తనిఖీలు చేపట్టారని, ఓ లాకర్‌ను పగులగొట్టి మరీ తెరిచారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఓ ప్రకటనలో చెప్పారు. పాం బీచ్‌లోని మార్ ఎ లాగో (ట్రంప్ నివాసం) వద్దకు ఎఫ్‌బీఐ ఏజెంట్లు భారీగా వచ్చారని ఆయన అన్నారు. ‘ఇవి అమెరికాకు చీకటి రోజులు’ అంటూ ట్రంప్ పేర్కొనడం గమనార్హం. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో కొన్ని అధికారిక పత్రాల దుర్వినియోగం కేసులో ఈ సోదాలు జరిగాయి.

Donald Trump on FBI raids: నా ఇంట్లో లాకర్ పగులగొట్టి మరీ తనిఖీలు చేశారు: ట్రంప్

FBI raids on Trump home

Donald Trump on FBI raids: ఫెడరల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ) అధికారులు ఫ్లోరిడాలోని తన ఇంట్లో తనిఖీలు చేపట్టారని, ఓ లాకర్‌ను పగులగొట్టి మరీ తెరిచారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఓ ప్రకటనలో చెప్పారు. పాం బీచ్‌లోని మార్ ఎ లాగో (ట్రంప్ నివాసం) వద్దకు ఎఫ్‌బీఐ ఏజెంట్లు భారీగా వచ్చారని ఆయన అన్నారు. ‘ఇవి అమెరికాకు చీకటి రోజులు’ అంటూ ట్రంప్ పేర్కొనడం గమనార్హం. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో కొన్ని అధికారిక పత్రాల దుర్వినియోగం కేసులో ఈ సోదాలు జరిగాయి.

మార్ ఎ లాగోలోనే ఆ పత్రాలు ఉన్నాయని ఎఫ్‌బీఐ ఏజెంట్లు అనుమానిస్తున్నారు. మార్ ఎ లాగోలో సోదాలు జరుగుతోన్న సమయంలో ట్రంప్ న్యూయార్క్‌లోని ట్రంప్ టవర్‌లో ఉన్నారు. ఈ సోదాల గురించి అధికారులు ఎటువంటి ప్రకటనా చేయలేదు. ట్రంప్ కుటుంబ సభ్యులు మాత్రం సోదాలు జరిగాయని మీడియాకు తెలిపారు. ప్రభుత్వ సంస్థలు జరుపుతోన్న విచారణకు తాను సహకరిస్తున్నానని, అయినప్పటికీ తనకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఎఫ్‌బీఐ ఏజెంట్లు సోదాలు చేయడం ఏంటని ఆయన నిలదీశారు.

ఈ తీరు సరికాదని, దేశ న్యాయవ్యవస్థను ప్రభుత్వం ఆయుధంలా వాడుకుంటోందని ఆయన అన్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలు 2024లో జరగనున్నాయి. ఈ ఎన్నికల్లోనూ పోటీ చేయడానికి ట్రంప్ సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో సోదాలు జరగడం గమనార్హం. తన ఇంటిపై అధికారులు జరిపిన దాడుల వంటివి విచ్ఛిన్న దేశాలు, తృతీయ ప్రపంచ దేశాల్లోనే జరుగుతాయని, ఇప్పడు తమ దేశంలోనూ అలాంటివి జరగడం దురదృష్టకరమని ట్రంప్ అన్నారు. తమ దేశంలో ఇప్పుడు అవినీతి భారీగా పెరిగిపోయిందని చెప్పారు.

ట్రంప్ ఇల్లు సీక్రెట్‌ సర్వీస్‌ సిబ్బంది భద్రతలో ఉంటుంది. ట్రంప్ ఇంటికి వచ్చిన అధికారులు సీక్రెట్‌ సర్వీస్‌ అధికారులకు వారెంట్‌ విషయం చెప్పారు. ఈ నేపథ్యంలో ఎఫ్‌బీఐ అధికారులను సీక్రెట్‌ సర్వీస్‌ సిబ్బంది ట్రంప్ నివాసంలోకి అనుమతించారు. ఎఫ్‌బీఐ అధికారులు జరిపిన సోదాలపై డొనాల్డ్ ట్రంప్‌ రెండో కుమారుడు ఎరిక్‌ స్పందించారు. నేషనల్ ఆర్కైవ్స్ రికార్డుల వ్యవహారంలో విచారణలో భాగంగా ఎఫ్‌బీఐ అధికారులు తనిఖీలు చేశారని తెలిపారు. అయితే అధికారులు స్థానిక ఎఫ్‌బీఐ కార్యాలయం నుంచి రాలేదని అన్నారు. వారు అధ్యక్షుడు బైడెన్ కార్యాలయం నుంచి వచ్చారని ఆరోపించారు.