Shot In Face: ఢిల్లీలో పుట్టినరోజున వేడుకలో కాల్పులు.. యువకుడి ముఖంలోకి దూసుకెళ్లిన బుల్లెట్

పుట్టినరోజు వేడుకలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఈ వేడుకలో ఓ వ్యక్తి తుపాకీతో ఓ యువకుడి ముఖంపై కాల్పులు జరిపి కలకలం రేపాడు. ఢిల్లీలోని ఫతేపూర్ బేరిలోని జోనాపూర్ గ్రామంలో ఓ చిన్నారి పుట్టినరోజు వేడుక జరుగుతోంది. ఆ పార్టీకి పలువురు యువకులు హాజరయ్యారు. ఆ సమయంలో ప్రమోద్ అనే వ్యక్తి ముఖంపై మరో వ్యక్తి కాల్పులు జరిపాడు.

Shot In Face: ఢిల్లీలో పుట్టినరోజున వేడుకలో కాల్పులు.. యువకుడి ముఖంలోకి దూసుకెళ్లిన బుల్లెట్

Updated On : January 14, 2023 / 11:38 AM IST

Shot In Face: పుట్టినరోజు వేడుకలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఈ వేడుకలో ఓ వ్యక్తి తుపాకీతో ఓ యువకుడి ముఖంపై కాల్పులు జరిపి కలకలం రేపాడు. ఢిల్లీలోని ఫతేపూర్ బేరిలోని జోనాపూర్ గ్రామంలో ఓ చిన్నారి పుట్టినరోజు వేడుక జరుగుతోంది. ఆ పార్టీకి పలువురు యువకులు హాజరయ్యారు. ఆ సమయంలో ప్రమోద్ అనే వ్యక్తి ముఖంపై మరో వ్యక్తి కాల్పులు జరిపాడు.

దీంతో ప్రమోద్ ను వెంటనే ఆసుపత్రికి తరలించారు. రాంపాల్ అనే వ్యక్తి తుపాకీతో వచ్చి ప్రమోద్ వైపుగా 7-8 రౌండ్ల కాల్పులు జరిపాడని ఓ సాక్షి తెలిపాడు. ‘‘పుట్టినరోజు వేడుక జరుగుతుండగా రాంపాల్ అనే వ్యక్తి 7-8 మందితో అక్కడకు వచ్చాడు. టెర్రస్ మీదకు వెళ్లి ప్రమోద్ వైపునకు కాల్పులు జరిపాడు’’ అని ప్రమోద్ సోదరుడు వినోద్ చెప్పాడు.

ఆ బుల్లెట్లు ప్రమోద్ కు తగలలేదని అన్నాడు. కాల్పులు జరపకూడదని ప్రమోద్ అన్నాడని, అయితే, టెర్రస్ పై నుంచి కిందకు వచ్చాక రాంపాల్ మరోసారి కాల్పులు జరపడంతో ప్రమోద్ ముఖంలోకి ఓ బుల్లెట్ దూసుకెళ్లిందని చెప్పాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పూర్తి వివరాలు రాబడుతున్నారు. ప్రమోద్ కు తీవ్రగాయాలు కావడంతో అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

Heart Attack Risk : చల్లని వాతావరణం గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుందా? శీతాకాలంలో రక్తపోటు విషయంలో…