దిశ కంట్రోల్ రూమ్ : మొదటి బ్యాచ్ సిబ్బందికి శిక్షణ పూర్తి

  • Published By: chvmurthy ,Published On : March 2, 2020 / 06:19 PM IST
దిశ కంట్రోల్ రూమ్ : మొదటి బ్యాచ్ సిబ్బందికి శిక్షణ పూర్తి

Updated On : March 2, 2020 / 6:19 PM IST

ఆంధ్ర ప్రదేశ్ లో దిశ కంట్రోల్ రూమ్‌లలో పనిచేసేందుకు ఎంపికైన తొలిబ్యాచ్‌కు దిశ స్పెషల్ ఐపీఎస్ అధికారిని దీపికా పాటిల్‌ ఆధ్వర్యంలో శిక్షణ పూర్తయింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, రాజమండ్రికి చెందిన 26 మంది యువతీ యువకులు మొదటి బ్యాచ్‌లో శిక్షణ పొందారు. దిశ అప్లికేషన్ ఏ విధంగా పనిచేస్తుంది, బాధితులు ఫిర్యాదు చేసినప్పుడు ఎలా స్పందించాలి, సమాచారాన్ని దిశ ఎమర్జెన్సీ టీమ్‌లకు ఎలా చేరవేయాలి అనే అంశాలపై వారికి శిక్షణ ఇచ్చారు.  
శిక్షణ పూర్తి చేసుకున్న సిబ్బందితో డీజీపీ గౌతం సవాంగ్

police disga sos

శిక్షణ పూర్తి చేసుకున్న యువతీ యువకులకు డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ పలు సూచనలు చేశారు. దిశ కంట్రోల్ రూమ్, దిశ ఎస్‌ఓఎస్‌ అప్లికేషన్ ప్రాముఖ్యతను, ఆపదలో ఉన్న మహిళల్ని ఎలా రక్షించాలో  ఆయన వివరించారు. దేశంలోనే తొలిసారిగా ప్రవేశ పెట్టిన దిశ పోలీస్ స్టేషన్ విధులలో కీలక పాత్ర పోషించాలని ఆకాక్షించారు. ముఖ్యంగా మహిళల రక్షణే బాధ్యతగా భావించాలని, ఉద్యోగంలా కాకుండా సేవా గుణంతో బాధ్యతయుతంగా పనిచేయాలని గౌతంసవాంగ్ పిలుపు నిచ్చారు.