Mumbai: ఆన్‌లైన్‌లో సమోసాలు ఆర్డర్ చేసిన పాపానికి రూ-1.40 లక్షలు గోవిందా
బాధితుడు, అతని సహచరులు కర్జాత్‌లో పిక్నిక్ ప్లాన్ చేశారు. ప్రయాణానికి సమోసాలు ఆర్డర్ చేశారు. అతను ఆన్‌లైన్‌లో తినుబండారాల నంబర్‌ను గుర్తించిన తర్వాత ఆర్డర్ చేసాడు. అతను నంబర్‌కు కాల్ చేసినప్పుడు, సమాధానం ఇచ్చిన వ్యక్తి ముందుగా 1,500 రూపాయలు చెల్లించమని అడిగాడు

Online Fraud: ఆన్‌లైన్‌లో సమోసా ఆర్డర్ చేసిన ఒక డాక్టరుకు ఊహించని షాక్ ఎదురైంది. ముంబైలోని సివిక్ రన్ కెఇఎమ్ ఆసుపత్రికి చెందిన 27 ఏళ్ల డాక్టర్ అకౌంట్ నుంచి ఏకంగా 1.40 లక్షల రూపాయలు మాయం అయ్యాయి. ఈ ఘటన శనివారం ఉదయం జరిగినట్లు పోలీసులు తెలిపారు. “బాధితుడు, అతని సహచరులు కర్జాత్‌లో పిక్నిక్ ప్లాన్ చేశారు. ప్రయాణానికి సమోసాలు ఆర్డర్ చేశారు. అతను ఆన్‌లైన్‌లో తినుబండారాల నంబర్‌ను గుర్తించిన తర్వాత ఆర్డర్ చేసాడు. అతను నంబర్‌కు కాల్ చేసినప్పుడు, సమాధానం ఇచ్చిన వ్యక్తి ముందుగా 1,500 రూపాయలు చెల్లించమని అడిగాడు.
Revanth Reddy : దుమారం రేపుతున్న రేవంత్ రెడ్డి ‘ఉచిత కరెంట్’ వ్యాఖ్యలు
డాక్టరుకు వాట్సాప్ సందేశం వచ్చింది. దానిలో ఆర్డర్ నిర్ధారణ, ఆన్‌లైన్‌లో డబ్బు పంపడానికి బ్యాంక్ ఖాతా నంబర్ ఉన్నాయి. డాక్టర్ 1,500 రూపాయలు పంపారు. ఆ చివర ఉన్న వ్యక్తి చెల్లింపు కోసం డాక్టర్ లావాదేవీ ఐడిని సృష్టించాలని చెప్పాడు. ఒకదాన్ని రూపొందించడానికి సూచనలను అనుసరిస్తున్న సమయంలో మొదట 28,807 రూపాయలు, తరువాత 1.40 లక్షల రూపాయలు అకౌంట్ నుంచి కట్ అయ్యాయి” అని పోలీసు అధికారి తెలిపారు.
KTR Tweet : పాతబస్తీలో మెట్రో రైలు మార్గానికి గ్రీన్ సిగ్నల్.. ట్వీట్ చేసిన మంత్రి కేటీఆర్
డాక్టర్ ఫిర్యాదుపై భోయివాడ పోలీస్ స్టేషన్‌లో ఇండియన్ పీనల్ కోడ్ తో పాటు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ నిబంధనల ప్రకారం కేసు నమోదు చేసినట్లు అధికారి తెలిపారు.