Dr. Preeti Case : డాక్టర్ ప్రీతి టాక్సికాలజీ రిపోర్టులో సంచలన విషయాలు.. శరీరంలో విష రసాయనాల ఆనవాళ్లు లేవని వెల్లడి
డాక్టర్ ప్రీతి మృతి కేసు పోలీసులకు సవాల్ గా మారింది. వరంగల్ పోలీసులకు ప్రీతి కేసు చిక్కుముడిగా మారింది. ప్రీతి టాక్సికాలజీ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగు చూసినట్లు తెలుస్తోంది.

DR.PREETI
Dr. Preeti Case : డాక్టర్ ప్రీతి మృతి కేసు పోలీసులకు సవాల్ గా మారింది. వరంగల్ పోలీసులకు ప్రీతి కేసు చిక్కుముడిగా మారింది. ప్రీతి టాక్సికాలజీ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగు చూసినట్లు తెలుస్తోంది. ప్రీతి పాయిజన్ ఇంజెక్షన్ తీసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్టు ఇటు కాకతీయ మెడికల్ యాజమాన్యం, అటు పోలీసులు మొదటి నుంచి చెబుతూవస్తున్నారు. అయితే టాక్సికాలజీ రిపోర్టులో మాత్రం ప్రీతి శరీరంలో అసలు విష పదార్థాలే డిటెక్ట్ కాలేదని తేలినట్లు సమాచారం.
ప్రీతి బాడీలో ఎలాంటి విష రసాయనాల ఆనవాళ్లు లేవని టాక్సికాలజీ రిపోర్టులో వెల్లడైనట్లు తెలుస్తోంది. గుండె, కాలేయం, రక్తంతోపాటు పలు అవయవాళ్లో విష పదార్థాల ఆనవాళ్లు దొరకలేదని టాక్సికాలజీ రిపోర్టులో ఉన్నట్లు తెలుస్తోంది. టాక్సీకాలజీ రిపోర్టు వరంగల్ సీపీ రంగనాథ్ కు చేరింది. ప్రీతి బాడీలో విష పదార్ధాలే లేనప్పుడు మరి ఆమె ఎలా చనిపోయారన్నది తెలియాల్సివుంది. దీంతో ప్రీతి హత్యా? ఆత్మహత్యా అనేది పోలీసులు తేల్చుకోలేకపోతున్నారు.
Medico Preeti Case : మెడికో ప్రీతి మృతి కేసులో మరో కీలక ఆధారం లభ్యం
తాజాగా వచ్చిన టాక్సికాలజీ రిపోర్టుతో పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. ప్రీతి ఆర్గాన్స్ పై విష ప్రభావం లేదనే రిపోర్టుతో కేసు సందిగ్ధంలో పడింది. సూసైడ్ కేసును అనుమానాస్పద కేసుగా మార్చే పనిలో పోలీసులు ఉన్నట్లు తెలుస్తోంది. టాక్సికాలజీ రిపోర్టుతో ప్రీతి కేసు మిస్టరీగా మారనుంది. అనస్తీషియా డిపార్ట్ మెంట్ హెచ్ వోడీ వ్యవహారంపై సతమతమవుతున్నారు.
ప్రీతి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి రావడంతో వరంగల్ పోలీసు కమిషనర్ రంగనాథ్ ఇవాళ హైదరాబాద్ కు రానున్నారు. మరోవైపు ఇప్పటికే డీజీపీ అంజనీ కుమార్ వరంగల్ సీపీకి ఫోన్ చేసి, ప్రీతి కేసుపై ఆరా తీశారు. ఇప్పుడు టాక్సికాలజీ ఏవీ.రంగనాథ్ చేతికి రావడంతో సోమవారం ఆయన హైదరాబాద్ కు రానున్నారు. ప్రీతి కేసులో ఏవీ.రంగనాథ్ ను డీజీపీ పిలవడంతో ఉత్కంఠ నెలకొంది.