Middle Finger to Woman: మహిళకు మధ్య వేలు చూపిస్తే 6నెలల జైలు శిక్ష

రోడ్ మీద జరిగిన గొడవలో మహిళకు మధ్య వేలు చూపించాడో వ్యక్తి. నిందితుడైన 33ఏళ్ల అనికేత్ పాటిల్ ను దోషిగా పేర్కొంటూ.. ముంబైలోని గిర్గావ్ మెజిస్ట్రేట్ కోర్ట్ తీర్పునిచ్చింది.

Middle Finger to Woman: మహిళకు మధ్య వేలు చూపిస్తే 6నెలల జైలు శిక్ష

Middle Finger Woman

Updated On : December 13, 2021 / 9:37 AM IST

Middle Finger to Woman: రోడ్ మీద జరిగిన గొడవలో మహిళకు మధ్య వేలు చూపించాడో వ్యక్తి. నిందితుడైన 33ఏళ్ల అనికేత్ పాటిల్ ను దోషిగా పేర్కొంటూ.. ముంబైలోని గిర్గావ్ మెజిస్ట్రేట్ కోర్ట్ తీర్పునిచ్చింది. 66ఏళ్ల మహిళను దుర్భాషలాడుతూ మధ్య వేలు చూపించి అసభ్యకరంగా ప్రవర్తించినందుకుగానూ కేసు ఫైల్ చేశామని తెలిపారు.

2018 సెప్టెంబర్ 17న పాటిల్.. ఓ మహిళ.. ఆమె కొడుకుతో వాదనకు దిగాడు. ఆఫీసుకు వెళ్తూ కాడ్బరీ జంక్షన్ కు చేరుకున్నారు వారిద్దరూ. అకస్మాత్తుగా ఎడమవైపు నుంచి ఓ రెడ్ కార్ వచ్చి డివైడర్ వైపుకు వెళ్లేలా మీదకు వచ్చాడు. 100మీటర్ల వరకూ అలా కారు మీదకు వస్తూనే ఉంది. ఎలాగోలా తప్పించుకుని ముందుకు వచ్చి సిగ్నల్ దగ్గర కారు ఆగింది.

వెనుక నుంచి వచ్చిన కార్.. ఓవర్ టేక్ చేయడానికి ప్రయత్నిస్తూ పక్కనే ఆగింది. అంతే కార్ విండో ఓపెన్ చేసి తిట్టి పారిపోయేందుకు ప్రయత్నించాడు అటువైపు వ్యక్తి. ఆమె కొడుకు కారును అడ్డుపెట్టడంతో ట్రాఫిక్ ఆగిపోయి సీన్ లోకి ట్రాఫిక్ పోలీస్ ఎంటరయ్యాడు.

పాటిల్ ను గందేవీ పోలీసు స్టేషన్ కు తీసుకెళ్లారు. ఆ రోడ్ మీద జరిగిన వాదనలో మధ్యవేలు చూపిస్తూ అసభ్యకరంగా ప్రవర్తించాడని మహిళ ఫిర్యాదు చేసింది. సెక్షన్స్ 354ఏ, 345 డీ, సెక్షన్స్ 509 ప్రకారం కేసులు నమోదు చేశారు. ‘ప్రతి మహిళకు సమాజంలో డిగ్నిటీతో బతికే హక్కు ఉంది. వారి ప్రాథమిక హక్కులకు భంగం కలిగేంచాలే ఏం చేసినా సమాజానికి తప్పుడు సందేశం అందుతుందని’ మెజిస్ట్రేట్ వెల్లడించారు.