గెటప్ కుమార్ : 20మంది యువతుల్ని ట్రాప్ చేసి..

విశాఖలో ఓ డ్రైవర్ డాక్టర్ అవతారం ఎత్తాడు. డాక్టరు అంటూ యువతుల జీవితాలతో ఆడుకున్నాడు. వారి ఫొటోలు, వీడియోలు తీసి బెదిరింపులకు పాల్పడుతూ.. బ్లాక్ మెయిల్ చేసేవాడు.

  • Published By: veegamteam ,Published On : November 16, 2019 / 08:09 AM IST
గెటప్ కుమార్ : 20మంది యువతుల్ని ట్రాప్ చేసి..

Updated On : November 16, 2019 / 8:09 AM IST

విశాఖలో ఓ డ్రైవర్ డాక్టర్ అవతారం ఎత్తాడు. డాక్టరు అంటూ యువతుల జీవితాలతో ఆడుకున్నాడు. వారి ఫొటోలు, వీడియోలు తీసి బెదిరింపులకు పాల్పడుతూ.. బ్లాక్ మెయిల్ చేసేవాడు.

విశాఖలో ఓ డ్రైవర్ డాక్టర్ అవతారం ఎత్తాడు. డాక్టరు అంటూ యువతుల జీవితాలతో ఆడుకున్నాడు. కంచరపాలెంలో డ్రైవర్ గా పని చేసిన కుమార్ అనే కేటుగాడు ఫేస్ అకౌంట్ లో తప్పుడు వివరాలతో యువతులకు గాలం వేసేవాడు. నమ్మించి వారి జీవితాలతో ఆడుకునే వాడు. సన్నిహితంగా ఉన్న సమయంలో వారి ఫొటోలు, వీడియోలు తీసి బెదిరింపులకు పాల్పడుతూ బ్లాక్ మెయిల్ చేసేవాడు. ఇక వారి దగ్గర నుంచి డబ్బు, బంగారం నగలు వసూలు చేశాడు. అంతేకాకుండా వారి స్నేహితులపైనా కన్నేశాడు. ఇలా 20 మంది జీవితాలతో ఆడుకున్నాడు. సుమారు ఆరు నెలలుగా మహిళలపై వేధింపులు కొనసాగిస్తున్నాడు. 

కుమార్ చేస్తున్న వికృత చేష్టలు భరించలేక ఒక అమ్మాయి సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన పోలీస్ కమిషనర్ కంచరపాలెం పోలీస్ స్టేషన్ కు ఆ ఫిర్యాదు పంపించాడు. కుమార్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని దగ్గర నుంచి సెల్ ఫోన్స్, కంప్యూటర్ ను స్వాధీనం చేసుకుని, అందులోని డేటాను పరిశీలిస్తున్నారు.

అతని దగ్గర ఏమైనా ఫొటోలు ఉన్నాయా.. ఎంతమందికి సంబంధించి ఫొటోలు, వీడియోలు రికార్డు చేశాడనే కోణంలో విచారణ చేస్తున్నారు. కుమార్ పలు గెటప్ లలో మోసాలకు ఒడిగట్టినట్లు చెబుతున్నారు బాధితులు. ఒకరికి డాక్టరుగానూ, మరొకరికి పోలీస్ గా వేశాలు మోసం చేశాడు. మహిళలను ట్రాప్ చేయడమే కాకుండా వారు ఏకాంతంగా గడిపిన ఫొటోలు, వీడియోలు తీసి బ్లాక్ బెయిల్ కు పాల్పడుతూ నగదు, బంగారం దోచుకెళ్తున్నాడు.

బాధితుల్లో ఒకరు నేరుగా పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడింది. మరో నలుగురు యువతులు కూడా పోలీస్ కమిషనర్ ను కలిసి అతని వికృత చేష్టలను వివరించారు. కుమార్ ఒక్కడేనా.. అతని వెనకాల ఏదైనా ముఠా ఉందా అనే కోణంలో పూర్తి స్థాయిలో విచారిస్తున్నారు. 20 నుంచి 25 మంది బాధితులు ఉన్నారు కాబట్టి పోలీసులు ఈ కేసును చాలా సీరియస్ గా తీసుకున్నారు.

కుమార్ స్నేహితులపై కూడా పోలీసులు దృష్టి సారించారు. వారి డేటాను కూడా సేకరించి, వారిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. బాధితులంతా ధైర్యంగా ముందుకు రావాలని పోలీస్ కమిషనర్ సూచించారు. బాధితులు ముందుకు వస్తేనే నిందితునికి కఠిన శిక్షలు పడే అవకాశం ఉందన్నారు.