మందుబాబు వీరంగం : పోలీసుల సెల్‌ఫోన్ పగలకొట్టాడు

హైదరాబాద్ : మందుబాబులు రెచ్చిపోతున్నారు. ఫుల్లుగా తాగి రోడ్డు మీదకి రావడమే కాదు.. ట్రాఫిక్ పోలీసులతోనూ గొడవకు దిగుతున్నారు. తాజాగా ఓ మందుబాబు

  • Published By: veegamteam ,Published On : April 13, 2019 / 02:49 AM IST
మందుబాబు వీరంగం : పోలీసుల సెల్‌ఫోన్ పగలకొట్టాడు

Updated On : April 13, 2019 / 2:49 AM IST

హైదరాబాద్ : మందుబాబులు రెచ్చిపోతున్నారు. ఫుల్లుగా తాగి రోడ్డు మీదకి రావడమే కాదు.. ట్రాఫిక్ పోలీసులతోనూ గొడవకు దిగుతున్నారు. తాజాగా ఓ మందుబాబు

హైదరాబాద్ : మందుబాబులు రెచ్చిపోతున్నారు. ఫుల్లుగా తాగి రోడ్డు మీదకి రావడమే కాదు.. ట్రాఫిక్ పోలీసులతోనూ గొడవకు దిగుతున్నారు. తాజాగా ఓ మందుబాబు చెలరేగిపోయాడు. ట్రాఫిక్ పోలీసులతో  వాగ్వాదానికి దిగాడు. అంతేకాదు.. పోలీసుల ఫోన్ లాక్కుని పగలకొట్టాడు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ లో ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారిపై  కేసులు నమోదు చేశారు.

డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో ఓ యువకుడు హంగామా చేశాడు. బ్రీత్ అనలైజర్‌ కు సహకరించకుండా పోలీసులతో ఘర్షణ పడ్డాడు. తన వీరంగంను సెల్‌ఫోన్‌లో రికార్డు చేస్తుండగా పోలీస్ చేతి నుంచి సెల్‌ఫోన్‌ లాక్కొని పగలకొట్టాడు. పరిస్థితి అదుపు తప్పడంతో సివిల్‌ పోలీసులు ఎంటర్ అయ్యారు. ఆ మందుబాబుని అదుపులోకి తీసుకున్నారు. డ్రంక్‌ అండ్ డ్రైవ్‌ కేసుతో పాటు సివిల్‌ కేసులు నమోదు చేసి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. బ్రీత్ అనలైజర్ టెస్ట్ లో ఆ వ్యక్తికి 180 పాయింట్లు వచ్చినట్టు పోలీసులు తెలిపారు. బాగా మందు తాగి ఉన్నాడని చెప్పారు. డ్రంక్ అండ్ డ్రైవ్ లో 21 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో 27 కేసులు నమోదు చేశారు. 12 కార్లు, 13 బైకులు, 2 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. మద్యం సేవించి వాహనం నడపరాదని, డ్రంక్‌ అండ్ డ్రైవ్‌లతో పాటు స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహిస్తామని హెచ్చరిస్తున్నారు పోలీసులు.

మద్యం తాగి వాహనాలు నడపొద్దని పోలీసులు పదే పదే హెచ్చరిస్తున్నారు. కేసులు బుక్ చేస్తున్నారు, ఫైన్లు వేస్తున్నారు, జైళ్లకు కూడా పంపిస్తున్నారు. అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయినా  మందుబాబుల తీరు మారడం లేదు. డ్రంకెన్ డ్రైవింగ్ పరిపాటిగా మారింది. ఎన్నిసార్లు తనిఖీలు చేపట్టినా, వాహనాలను సీజ్ చేస్తున్నా మార్పు రావడం లేదు. మద్యం మత్తులో డ్రైవింగ్ చేసి ప్రమాదాలకు కారణం  అవుతున్నారు. యాక్సిడెంట్ లో ప్రాణాలు కోల్పోతున్నారు. కొన్ని ఘటనల్లో అమాయకుల ప్రాణాలు తీస్తున్నారు.