Indus Viva Marketing Scam : ఇండస్ వివా మల్టీలెవల్ మార్కెటింగ్ స్కాం..వ్యవస్థాపకుడు, కో ఫౌండర్ అరెస్టు
దాదాపు 10లక్షల మంది నుంచి 15వందల కోట్ల రూపాయలను వసూలు చేసింది. సైబరాబాద్ EOWలో ఇప్పటికే 24మందిని అధికారులు అరెస్ట్ చేశారు.

Viva
founder and co-founder arrest : ఇండస్ వివా మల్టీలెవల్ మార్కెటింగ్ స్కాంలో ఈడీ దూకుడుగా వెళుతోంది. మార్కెటింగ్ స్కాంలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఇండస్ వివా వ్యవస్థాపకుడు అభిలాష్ థామస్, కో ఫౌండర్ CA అంజర్‌లను ఈడీ అరెస్ట్ చేసింది. ఇండస్ వివా మల్టీలెవల్ మార్కెటింగ్.. ఇంటర్నేషనల్ లెవల్‌లో మల్టీలెవల్ మార్కెటింగ్ కార్యకలాపాలు సాగించింది.
దాదాపు 10లక్షల మంది నుంచి 15వందల కోట్ల రూపాయలను వసూలు చేసింది. సైబరాబాద్ EOWలో ఇప్పటికే 24మందిని అధికారులు అరెస్ట్ చేశారు. బెంగుళూరులో లిమిటెడ్ కంపెనీని స్థాపించి.. ప్రభుత్వాల ఏజన్సీ అనుమతి లేకుండా ఆ సంస్థ కార్యకలాపాలు సాగించింది.
Minister Niranjan Reddy : బీజేపీతో చావోరేవో తేల్చుకుంటాం : మంత్రి నిరంజన్ రెడ్డి
అలీవ్ హెల్త్ సైన్సెస్ కంపెనీ పేరుతో అక్రమంగా ఉత్పత్తులను తయారి చేసింది. ఇండియా, అమెరికా, బంగ్లాదేశ్, ఉగాండా దేశాల్లో కస్టమర్స్‌కు కుచ్చుటోపి పెట్టింది. ఈ కేసులో స్టే కోసం గతంలో హైకోర్టును నిందితులు ఆశ్రయించారు.