Minister Niranjan Reddy : బీజేపీతో చావోరేవో తేల్చుకుంటాం : మంత్రి నిరంజన్ రెడ్డి

బీజేపీతో చావోరేవో తేల్చుకుంటామని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. ఆరుగురు మంత్రులు, పార్లమెంట్ సభ్యుల బృందంతో రేపు ఢిల్లీకి వెళ్తున్నామని చెప్పారు. కేంద్ర మంత్రులను కలుస్తామన్నారు.

Minister Niranjan Reddy : బీజేపీతో చావోరేవో తేల్చుకుంటాం : మంత్రి నిరంజన్ రెడ్డి

Niranjan

Niranjan Reddy criticized BJP : టీఆర్‌ఎస్‌ విస్తృతస్థాయి సమావేశం ముగిసింది. తెలంగాణ మంత్రుల బృందం రేపు ఢిల్లీ వెళ్లనుంది. ధాన్యం కొనుగోళ్లపై మంత్రులు కేంద్రానికి విజ్ఞప్తి చేయనున్నారు. కేంద్రం వైఖరికి వ్యతిరేకంగా ఈ నెల 20న రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేయాలని నిర్ణయించారు. సమావేశం ముగిసిన అనంతరం మంత్రి నిరంజన్ రెడ్డి మీడియాకు వివరాలను వెల్లడించారు.

బీజేపీతో చావోరేవో తేల్చుకుంటామని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. ఆరుగురు మంత్రులు, పార్లమెంట్ సభ్యుల బృందంతో రేపు ఢిల్లీకి వెళ్తున్నామని తెలిపారు. కేంద్ర మంత్రులను కలుస్తామని చెప్పారు. కేంద్రం స్పందన బట్టి తమ ప్రణాళిక ఉంటుందని వెల్లడించారు. బీజేపీ నేతలు చెప్పే విషయాలు లిఖితపూర్వకంగా ఇవ్వాలన్నారు. కేంద్రమంత్రి పీయూష్ గోయల్ బాధ్యతారహితంగా మాట్లాడారని పేర్కొన్నారు.

CM KCR : రైతులందరికీ రైతుబంధు ఇస్తాం : సీఎం కేసీఆర్

తెలంగాణలో ప్రతి ఏటా ధాన్యం ఉత్పత్తి పెరుగుతుందన్నారు. ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం స్పష్టమైన విధానం ప్రకటించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రం నుంచి 1 కోటీ 50 లక్షల మెట్రిక్‌ టన్నుల వరకు ధాన్యం వస్తుందని చెప్పారు. మిగులు ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలని కేంద్రాన్ని కోరుతామని తెలిపారు.

ప్రధాని అపాయింట్‌మెంట్‌ కూడా కోరుతున్నామని వెల్లడించారు. వానకాలంలోనే పరిస్థితి ఇలా ఉంటే.. యాసంగి పరిస్థితి ఏంటని ఆందోళన వ్యక్తం చేశారు. రైస్‌ మిల్లులలో ధాన్యం పెట్టేందుకు స్థలం లేదన్నారు. రైతులందరికీ రైతుబంధు ఇస్తామని స్పష్టం చేశారు. రైతుబంధు ఆపేది లేదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారని పేర్కొన్నారు. రైతుబంధు యథావిథిగా కొనసాగుతుందన్నారు.