ఇన్సూరెన్స్ మెడికల్ స్కామ్ కేసులో నివ్వెరపోయే నిజాలు

ఈఎస్ఐ ఐఎంఎస్ కేసులో ఈడీ దూకుడు పెంచింది. ఇన్సూరెన్స్ మెడికల్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈఎస్ఐ మాజీ డైరెక్టర్ దేవికారాణిపై ఈడీ కేసు నమోదు చేసింది.

  • Published By: veegamteam ,Published On : December 28, 2019 / 08:54 AM IST
ఇన్సూరెన్స్ మెడికల్ స్కామ్ కేసులో నివ్వెరపోయే నిజాలు

Updated On : December 28, 2019 / 8:54 AM IST

ఈఎస్ఐ ఐఎంఎస్ కేసులో ఈడీ దూకుడు పెంచింది. ఇన్సూరెన్స్ మెడికల్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈఎస్ఐ మాజీ డైరెక్టర్ దేవికారాణిపై ఈడీ కేసు నమోదు చేసింది.

ఈఎస్ఐ ఐఎంఎస్ కేసులో ఈడీ దూకుడు పెంచింది. ఇన్సూరెన్స్ మెడికల్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈఎస్ఐ మాజీ డైరెక్టర్ దేవికారాణిపై ఈడీ కేసు నమోదు చేసింది. దేవికారాణికి విదేశాల్లో కూడా ఆస్తులు ఉన్నట్టు విచారణలో గుర్తించారు. విదేశాల్లో పెట్టుబడులకు సంబంధించిన ఆధారాలు లభించడంలో ఈడీ కేసు నమోదు చేసి దర్యాప్తునకు సిద్ధమవుతోంది. దాదాపు మూడు నెలలుగా తవ్వుతున్న కొద్దీ ఒక్కొక్కటిగా అవినీతి వ్యవహారాలు బయటపడుతూనే ఉన్నాయి.

కోట్ల రూపాయల కుంభకోణంలో కొత్త విషయాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. డైరెక్టర్‌గా ఉండి దేవికారాణి కోట్లు కూడబెట్టింది. అధికారాన్ని అడ్డుపెట్టుకొని సంస్థను నిండా ముంచేసి అందినకాడికి దండుకుంది. వందల కోట్ల ఆస్తులను కూడబెట్టింది. ప్రలోభపెట్టి కొందరిని, భయపెట్టి మరికొందరిని ఈ ఊబిలోకి లాగింది. తన పదవితో పరిధి దాటి వ్యవహరించి భూములు, భవనాలు, బాండ్లు, నగల రూపంలో రెండు వందల కోట్ల రూపాయల ఆస్తులను అక్రమంగా వెనకేసుకుంది.

తీగ లాగితే కదిలిన అవినీతి కొండను చూసి ఏసీబీ అధికారులే విస్తుపోయారు. తెలంగాణ, ఏపీలో కలిపి 50 చోట్ల దేవికారాణి ఆస్తులను గుర్తించారు. తెలుగురాష్ట్రాల్లో 11 చోట్ల దేవికారాణికి ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయని.. వాటి ధర కోట్లలో ఉంటుందని ఏసీబీ అధికారులు వివరించారు. ఇల్లు, విల్లా, భూములు భాగ్యనగర సిగలో దేవికారాణి అక్రమ ఆస్తులను భారీగానే కూడబెట్టారు. షేక్‌పేట్‌లో 4 కోట్ల విలువైన విల్లా.. ఆదిత్య టవర్స్‌లో మూడు ప్లాట్లు కూడా కొనుగోలు చేసింది. సోమాజిగూడలో 3 ప్లాట్లు.. నానక్ రామ్‌గూడలో ఇండిపెండెంట్ ఇల్లు.. హైదరాబాద్‌లో 18 చోట్ల కమర్షియల్ షాపులు.. ఇలా హైదరాబాద్‌ నలుమూలల ఆస్తుల్ని తన పరం చేసుకుంది. పలు ప్రాంతాల్లో వ్యవసాయ భూములను తన వశం చేసుకుంది. తాజా విచారణలో విదేశాల్లోనూ ఆస్తులు కూడబెట్టినట్టు తేలింది.

తెలంగాణతోనే ఆగిపోలేదు ఈ అవినీతి తిమింగలం. ఏపీలో కూడా ఆస్తులను కూడబెట్టింది. చిత్తూరులో కోటి రూపాయల విలువగల భవనం.. విశాఖపట్టణం, మధురవాడలో ఇండిపెండెంట్ హౌజెస్‌ను ఏసీబీ అధికారులు గుర్తించారు. ఇక ఆరున్నర కోట్ల విలువైన డిపాజిట్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇక పలు బ్యాంకుల్లో పదుల సంఖ్యలో ఖాతాలు.. అందులో కోట్లలో నగదు ఉన్నట్టు గుర్తించారు. షెల్‌ కంపెనీలతో భారీగా అవినీతి సొమ్మును కూడబెట్టింది ఈఎస్‌ఐ మాజీ డైరెక్టర్‌. నగదు రూపంలో బంగారం రూపంగా.. ఫార్మా కంపెనీల నుంచి భారీగా ముడుపులు తీసుకుంది. ఇండెంట్ల డేట్స్‌ను మార్చి కూడా సంస్థ సొమ్మును కాజేసింది.

ఇలా నొక్కేసిన అవినీతి సొమ్ముతో దేవికారాణి జల్సాలు చేసినట్టు ఏసీబీ విచారణలో తేలింది. బర్త్‌డే పార్టీలు, కిట్టీ పార్టీలతో ఎంజాయ్‌ చేసింది. అక్రమంగా కూడబెట్టిన డబ్బుతో టూర్‌లకు కూడా వెళ్లినట్టు తేలింది. పార్టీలు, ఫంక్షన్ల పేరుతో దేవికారాణి పాటలకు స్టెప్పులేస్తూ ఏ భయమూ లేకుండా ఉల్లాసంగా గడిపింది. అంతేకాదు.. మార్షల్‌ ఆర్ట్స్‌ ప్రాక్టీస్‌ చేస్తున్న వీడియోలూ లభ్యమయ్యాయి.