National Herald Office: నేషనల్ హెరాల్డ్ ఆఫీస్‌కు సీల్ వేసిన ఈడీ

మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి ఢిల్లీలోని నేషనల్ హెరాల్డ్ సంస్థ కార్యాలయానికి బుధవారం ఈడీ సీల్ వేసింది. ఆఫీసులోని సాక్ష్యాలు తారుమారు అవ్వకూడదనే ఉద్దేశంతోనే సీల్ వేసినట్లు తెలుస్తోంది.

National Herald Office: నేషనల్ హెరాల్డ్ సంస్థకు సంబంధించి మనీ లాండరింగ్ కేసుపై విచారణ జరుపుతున్న ఈడీ తాజాగా ఆ సంస్థ కార్యాలయానికి సీల్ వేసింది. న్యూ ఢిల్లీలో యంగ్ ఇండియా లిమిటెడ్ పేరుతో ఉన్న కార్యాలయానికి బుధవారం సీల్ వేసింది. కార్యాలయం బయట కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసింది.

Jabalpur Hospital: ‘నాన్నా.. కాపాడు..’ కంటతడి పెట్టిస్తున్న యువకుడి చివరి మాటలు

తమ అనుమతి లేనిదే కార్యాలయం తెరవకూడదని ఆదేశించింది ఈడీ. సాక్ష్యాలు తారుమారు అవ్వకూడదనే ఉద్దేశంతోనే ఈడీ ఈ చర్యకు దిగినట్లు తెలుస్తోంది. నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి మంగళవారం ఈడీ పలు చోట్ల దాడులు నిర్వహించింది. ఢిల్లీలోని 11 చోట్ల దాడులు చేసింది. మరోవైపు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ నివాసం వద్ద కూడా అదనపు భద్రత ఏర్పాటు చేసింది. ఈ కేసుకు సంబంధించి ఇటీవల ఈడీ విచారణ వేగవంతం చేసిన సంగతి తెలిసిందే. ఇటీవలే కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీని ఈడీ విచారించింది. ఈ కేసుతో సంబంధం ఉన్న మిగతా నేతలకు కూడా ఈడీ సమన్లు జారీ చేసింది.

Delivery Boy: తండ్రికి యాక్సిడెంట్.. అతడి స్థానంలో ఫుడ్ డెలివరీ చేస్తున్న ఏడేళ్ల కొడుకు

అయితే, తాజాగా ఈ అంశంపై కాంగ్రెస్ నేత సల్మాన్ ఖుర్షీద్ మాట్లాడారు. ‘‘మనీ లాండరింగ్ కేసు విచారణ మనీ లేకుండానే సాగుతోంది. ఈ కేసులో మనీయే లేదు. మరి మనీ లాండరింగ్ ఎక్కడ్నుంచి జరుగుతుంది. కార్యాలయానికి సీల్ వేయడానికి కారణమే లేదు. ఆ కారణమేంటో కూడా త్వరలోనే తెలుస్తుంది’’ అని ఖర్షీద్ వ్యాఖ్యానించారు.

 

ట్రెండింగ్ వార్తలు