Jabalpur Hospital: ‘నాన్నా.. కాపాడు..’ కంటతడి పెట్టిస్తున్న యువకుడి చివరి మాటలు

‘నాన్నా కాపాడు’ అంటూ అగ్నిప్రమాదంలో ప్రాణాలు పోగొట్టుకోవడానికి ముందు ఒక యువకుడు తన తండ్రికి ఫోన్ చేసి చెప్పాడు. ఆ మాటలు తలచుకుని తండ్రి కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు.

Jabalpur Hospital: ‘నాన్నా.. కాపాడు..’ కంటతడి పెట్టిస్తున్న యువకుడి చివరి మాటలు

Jabalpur Hospital: ‘‘నాన్నా, చుట్టూ మంటలు అంటుకున్నాయ్… బయటికి రావడానికి దారి లేదు. తొందరగా వచ్చి కాపాడు’’ ఇవీ.. ఇటీవల ఒక ఆస్పత్రిలో జరిగిన అగ్ని ప్రమాదంలో ప్రాణాలు పోగొట్టుకున్న యువకుడి చివరి మాటలు. ప్రాణాలు పోవడానికి కొద్ది సేపటి ముందు ఆ యువకుడు తన తండ్రికి ఫోన్ చేసి అక్కడి సంగతి చెప్పాడు.

Kanpur: అలిగి పుట్టింటికి వెళ్లిన భార్య.. బతిమాలి తెచ్చుకునేందుకు సెలవు కావాలంటూ లీవ్ లెటర్ రాసిన ఉద్యోగి

తన కొడుకు అంత కష్టంలో సాయపడమని వేడుకున్నప్పటికీ, ఎక్కడో దూరాన ఉండటంతో కొడుకును రక్షించుకోలేకపోయాడు. దీంతో తన కొడుకు చివరగా తనతో చెప్పిన మాటల్ని తలచుకుని ఆ తండ్రి తల్లడిల్లాడు. గత సోమవారం మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో ఒక ప్రైవేటు ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. అందులో తన్మయ్ విశ్వకర్మ అనే 19 ఏళ్ల యువకుడు కూడా ఉన్నాడు. తన్మయ్ అదే రోజు ఉదయం ఆస్పత్రిలో చేరాడు. చెవి దగ్గర ఏదో సమస్య ఉండటంతోపాటు, బలహీనంగా అనిపించడంతో తన్మయ్ ఆస్పత్రికి వెళ్లాడు. బలహీనంగా ఉండటంతో తన్మయ్‌ను హాస్పిటల్‌లో చేర్చుకుని సెలైన్ ఎక్కించారు.

Delivery Boy: తండ్రికి యాక్సిడెంట్.. అతడి స్థానంలో ఫుడ్ డెలివరీ చేస్తున్న ఏడేళ్ల కొడుకు

తర్వాత డాక్టర్లు అతడి తండ్రిని ఆస్పత్రికి రమ్మని చెప్పారు. ఉదయం 11 గంటల వరకు రమ్మంటే, తండ్రికి వీలు కాకపోవడం వల్ల వెళ్లలేదు. ఘటన జరగడానికి రెండు గంటల ముందు హాస్పిటల్‌లో ఫొటో తీసుకుని ఫ్యామిలీ మెంబర్స్‌కు పంపించాడు. ఆ తర్వాతే అగ్ని ప్రమాదం జరిగింది. మధ్యాహ్నం 02:49 గంటలకు తండ్రికి కాల్ చేశాడు. అప్పుడు వాయిస్ సరిగ్గా వినిపించలేదు. మళ్లీ కాస్సేపటికి ఫోన్ చేసి చుట్టూ మంటలు అంటుకున్నాయని, బయటికి రాలేకపోతున్నానని, వచ్చి కాపాడమని తండ్రిని కోరాడు. తర్వాత కొద్దిసేపటికే తన్మయ్ ప్రాణాలు కోల్పోయాడు.

Haryana: కూతురుకు కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చినందుకు వైద్య సిబ్బందిపై తండ్రి దాడి

తన కొడుకు ఇలా ప్రాణాలు కోల్పోవడంపై తన్మయ్ తండ్రి తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. సరైన ఏర్పాట్లు లేని ఆస్పత్రులకు అనుమతులు ఎలా ఇస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాడు. తన కొడుకు చివరి మాటల్ని తలచుకుని కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.