Haryana: కూతురుకు కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చినందుకు వైద్య సిబ్బందిపై తండ్రి దాడి

కూతురుకు కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చినందుకు వైద్య సిబ్బందిపై దాడికి పాల్పడ్డాడో తండ్రి. అంతేకాదు.. ఇంకోసారి తమ గ్రామంలోకి వస్తే వారిని చంపుతానని బెదిరించాడు. దీంతో భయపడ్డ సిబ్బంది అక్కడ్నుంచి పారిపోయి, పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Haryana: కూతురుకు కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చినందుకు వైద్య సిబ్బందిపై తండ్రి దాడి

Haryana: కూతురుకు కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చినందుకు వైద్య సిబ్బందిపై దాడికి పాల్పడ్డాడో తండ్రి. ఈ ఘటన ఇటీవల హరియాణాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గత నెల 29న నిహల్ ఘర్ గ్రామానికి చెందిన ఒక మహిళ తన కూతురుతోపాటు స్థానిక హెల్త్ సెంటర్‌కు వచ్చింది.

Kanpur: అలిగి పుట్టింటికి వెళ్లిన భార్య.. బతిమాలి తెచ్చుకునేందుకు సెలవు కావాలంటూ లీవ్ లెటర్ రాసిన ఉద్యోగి

అక్కడ మహిళ తన కూతురుకు కూడా వ్యాక్సిన్ ఇవ్వమని అడిగింది. ఆమెకు వ్యాక్సిన్ అర్హత వయస్సు ఉండటంతోపాటు తల్లి సూచన మేరకు వైద్య సిబ్బంది బాలికకు వ్యాక్సిన్ ఇచ్చారు. అయితే, ఈ విషయం తెలుసుకున్న బాలిక తండ్రి హరున్ కోపంతో హెల్త్ సెంటర్‌కు చేరుకున్నాడు. అక్కడున్న ఆశా, అంగన్‌వాడీ కార్యకర్తలతోపాటు, వైద్య సిబ్బందిపై దాడికి పాల్పడ్డాడు. వైద్య సిబ్బందిని చంపుతానని బెదిరించాడు. ఇంకోసారి తమ గ్రామంలోకి రావొద్దని హెచ్చరించాడు. దీంతో వైద్య సిబ్బంది అక్కడ్నుంచి ఎలాగోలా తప్పించుకున్నారు.

Thummala Nageswara Rao: ఏ క్షణమైనా పిడుగు పడొచ్చు.. కార్యకర్తలు సిద్ధంగా ఉండాలి: మాజీ మంత్రి తుమ్మల

తర్వాత పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు హరున్ కోసం గాలించారు. పారిపోయేందుకు ప్రయత్నించిన అతడ్ని పోలీసులు అరెస్టు చేశారు. విచారణలో తన నేరం అంగీకరించాడు.