వివాహేతర సంబంధం : ఎనిమిదేళ్ల బాలిక దారుణ హత్య

కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలులో దారుణం జరిగింది. వివాహేతర సంబంధం బాలిక ప్రాణం తీసింది.

  • Published By: veegamteam ,Published On : February 20, 2019 / 04:27 AM IST
వివాహేతర సంబంధం : ఎనిమిదేళ్ల బాలిక దారుణ హత్య

కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలులో దారుణం జరిగింది. వివాహేతర సంబంధం బాలిక ప్రాణం తీసింది.

కృష్ణా : పెనుగంచిప్రోలులో దారుణం జరిగింది. వివాహేతర సంబంధం బాలిక ప్రాణం తీసింది. ఎనిమిదేళ్ల బాలిక దారుణ హత్య గావించబడింది. నిద్రిస్తున్న బాలికను ఎత్తుకెళ్లి చంపేశారు.

గుమ్మడిదుర్రులో నిన్న రాత్రి ఇంట్లో తల్లిదండ్రుల వద్ద నిద్రిస్తున్న ఎనిమిదేళ్ల బాలిక ఈశ్వరీని గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లి హత్య చేశారు. పంట పొలాల్లో పోలీసులు మృతదేహాన్ని గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల కోసం గాలిస్తున్నారు. బాలిక మృతదేహానికి కొద్ది సేపట్లో పోస్టుమార్టం నిర్వహించనున్నారు. ఆస్తి వివాదాలతోపాటు, వివాహేతర సంబంధమే హత్యకు కారణమని పోలీసులు ప్రాథమిక నిర్థారణకు వచ్చారు. 

భార్యాభర్తలు నిద్రిస్తున్న సమయంలో భార్యతో వివాహేతర సంబంధం ఉన్న వ్యక్తి రాత్రికి ఇంటికి వచ్చాడు. ఇద్దరి మధ్య జరుగుతున్న విషయాన్ని చూసిన భర్త వెంటనే స్పందించి భార్యతోపాటు వివాహేతర సంబంధం నిర్వహిస్తున్న వ్యక్తితో గొడవ పడ్డాడు. అర్ధరాత్రి వరకూ గొడవ జరిగింది. దీంతో అతడు వెళ్లి పోయాడు. 

వచ్చిన వ్యక్తికి సంబంధం లేదని.. భర్తకు తనకే పాప జన్మించిందని ఆమె చెబుతుంది. అయితే బాలికను ప్రియుడు చంపాడా…భర్త చంపాడా అన్న విషయాన్ని భార్య ఇంతవరకు చెప్పలేదు. తాము వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నా…పాప మాత్రం తనకు, భర్తకే పుట్టిందని భార్య చెబుతోంది. మరోవైపు భార్యకు, వేరే వ్యక్తితో ఎప్పటి నుంచో వివాహేతర సంబంధం కొనసాగుతోందని భర్త అంటున్నాడు. పాప తనకు పుట్టలేదని చెబుతున్నాడు. ఎన్నిసార్లు హెచ్చరించినా..పద్ధతి మార్చుకోలేదని.. ప్రత్యక్షంగా చూశానని తెలిపారు.