Fake Baba Arrested : రూ.100 ను రూ.200 చేస్తానంటూ మోసం చేస్తున్న దొంగ బాబా అరెస్ట్

మాయమాటలతో ప్రజలను మోసం చేస్తున్న బురిడీ బాబాను ఆదిలాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు.

Fake Baba Arrested : రూ.100 ను రూ.200 చేస్తానంటూ మోసం చేస్తున్న దొంగ బాబా అరెస్ట్

Fake Baba Arrested

Updated On : October 19, 2021 / 5:49 PM IST

Fake Baba Arrested :  మాయమాటలతో ప్రజలను మోసం చేస్తున్న బురిడీ బాబాను ఆదిలాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఉట్నూరు మండలం శ్యాంపూర్ కు చెందిన సూర్యవంశీ అనే వ్యక్తి ఇటీవల బాబా అవతారం ఎత్తాడు. తాను పూజల ద్వారా డబ్బును రెండింతలు చేస్తానని ప్రజలను నమ్మించాడు. వందను రెండు వందలు 500ను వెయ్యిగా చేస్తానని బాగా నమ్మించాడు.

ఈ క్రమంలో మాయబాబా మాటలు నమ్మి ఆదిలాబాద్ కు చెందిన పారూక్ లక్ష రూపాయలు ఇచ్చి పూజలు చేయించాడు. పూజల తర్వాత బాబా రూ. లక్షన్నర ఇచ్చి ఫరూక్ కు నమ్మకం కలిగించాడు. ఈవిషయాన్ని ఫరూక్ తన బంధువులలో కొందరికి చెప్పాడు.

Also Read : Chigurupati Jayaram : NRI చిగురుపాటి జయరాం హత్య కేసు-పబ్లిక్ ప్రాసిక్యూటర్ కి బెదిరింపులు

ఈనెల 15న ఫరూక్ బంధువులు బాబాకు రూ. 10 లక్షలు ఇచ్చి వాటిని రెట్టింపు చేసేందుకు పూజలు చేయమని కోరారు. ఆ డబ్బు తీసుకుని దొంగబాబా పరారయ్యాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దొంగబాబాతో పాటు అతనికి సహకరించిన సంగీత అనే మహిళను కూడా అరెస్ట్ చేశారు. వారి వద్దనుంచి రూ. 11 లక్షల 70 వేలు స్వాధీనం చేసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు.