ఒక్కో టికెట్ రూ.5వేలు..! తిరుమలలో మరోసారి నకిలీ దర్శన టికెట్ల కలకలం..

ఐదుగురిపై కేసు నమోదు చేసిన పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.

ఒక్కో టికెట్ రూ.5వేలు..! తిరుమలలో మరోసారి నకిలీ దర్శన టికెట్ల కలకలం..

Updated On : August 19, 2024 / 9:53 PM IST

Tirumala Fake Darshan Tickets : తిరుమలలో మరోసారి నకిలీ దర్శన టికెట్ల కలకలం రేగింది. ఏపీ టూరిజం ముసుగులో నకిలీ టికెట్లతో భక్తులకు దర్శనాలు కల్పిస్తున్న ముఠా గుట్టుని టీటీడీ అధికారులు రట్టు చేశారు. ప్రతిరోజు 30 నుంచి 40 మంది భక్తులకు ఏపీ టూరిజం కోటాలో దర్శనాలు కల్పిస్తున్నారు. చెన్నైకి చెందిన ట్రావెల్ ఏజెంట్, టీటీడీ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, ఏపీ టూరిజం ఉద్యోగులు కలిసి ఈ దందా చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఐదుగురిపై కేసు నమోదు చేసిన పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. నకిలీ టికెట్ల ముసుగులో పెద్ద ఎత్తున దందా సాగినట్లు తెలుస్తోంది.

ఏపీ టూరిజం ముసుగులో నకిలీ టికెట్లతో భక్తులను దర్శనాలకు పంపుతున్న వ్యవహారం వెలుగులోకి వచ్చింది. మొత్తం 5 మంది ఈ దందాలో పాలు పంచుకున్నట్లు టీటీడీ విజిలెన్స్, పోలీసు శాఖ గుర్తించింది. ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు. చెన్నైకి చెందిన ట్రావెల్ ఏజెన్సీ ఏజెంట్, టీటీడీ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, ఏపీ టూరిజంకు చెందిన ఉద్యోగులు కొందరు ముఠాగా ఏర్పడ్డారు.

నకిలీ టికెట్లతో నిత్యం 30 నుంచి 40 మంది భక్తులను శ్రీవారి దర్శనానికి పంపుతున్నారు. ఇది గుర్తించిన టీటీడీ వెంటనే అప్రమత్తమై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ముఠా గుట్టురట్టు చేశారు. చెన్నైకి చెందిన ట్రావెల్ ఏజెంట్, టీటీడీ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠా సభ్యులు ఒక్కో టికెట్ కు రూ.5వేల వరకు వసూలు చేసినట్లు సమాచారం.

శ్రీవారి దర్శనాలకు సంబంధించి ఏపీ టూరిజంకు కొంత కోటా ఉంటుంది. నిత్యం ఆన్ లైన్ లో కొనుగోలు చేసి దర్శనానికి వెళ్తుంటారు. దీన్ని కొందరు కేటుగాళ్లు క్యాష్ చేసుకుంటున్నారు. ఏపీ టూరిజం కోటాలో నకిలీ టికెట్లతో భక్తులను శ్రీవారి దర్శనానికి అనుమతిస్తున్నారు. మొత్తం ముఠాగా ఏర్పడి కొన్ని రోజులుగా ఈ దందాను పెద్ద ఎత్తున నడిపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

Also Read : నిరుద్యోగులూ బీ అలర్ట్.. సాఫ్ట్‌వేర్ జాబ్ పేరుతో ఘరానా మోసం, రూ.10 కోట్లతో పరార్