Tamilnadu : ప్రాణం తీసిన రమ్మీ, అప్పుల బాధతో కుటుంబంలోని నలుగురు ఆత్మహత్య
ఆన్ లైన్ గేమ్స్ మోజులో లక్షలాది రూపాయలు నష్టపోతున్నారు. ఫలితంగా అప్పుల వారి నుంచి ఒత్తిడిలు అధికం కావడంతో తనువు చాలిస్తున్నారు. వారు చనిపోవడమే కాకుండా...కుటుంబసభ్యులను కూడా ఆత్మహత్య చేసుకొనే పరిస్థితిని కల్పిస్తున్నారు. తాజాగా..తమిళనాడు రాష్ట్రంలో ఇలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది.

Online Game
Online Rummy Games : ఆన్ లైన్ గేమ్స్ ఆడొద్దు..ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు అని పోలీసులు, ఇతరులు ఎంత మొత్తుకొని చెబుతున్నా..కొంతమంది నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఆన్ లైన్ గేమ్స్ మోజులో లక్షలాది రూపాయలు నష్టపోతున్నారు. ఫలితంగా అప్పుల వారి నుంచి ఒత్తిడిలు అధికం కావడంతో తనువు చాలిస్తున్నారు. వారు చనిపోవడమే కాకుండా…కుటుంబసభ్యులను కూడా ఆత్మహత్య చేసుకొనే పరిస్థితిని కల్పిస్తున్నారు. తాజాగా..తమిళనాడు రాష్ట్రంలో ఇలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. అప్పుల బాధతో ఒకే కుటుంబంలోని నలుగురు ఆత్మహత్యకు పాల్పడడం కలకలం రేపింది.
Read More : Anasuya Bharadwaj : బరువు పెరిగిన స్టార్ యాంకర్.. ‘పుష్ప’ కోసమేనా..
రాష్ట్రంలోని కృష్ణగిరి జిల్లా హోసూరులో మోహన్ తన కుటుంబంతో నివాసం ఉంటున్నారు. ఇతనికి తల్లి వసంత (61), భార్య రమ్య (36), కొడుకు అన్వయ్ (10) ఉన్నారు. అయితే…మోహన్ కు ఆన్ లైన్ లో గేమ్స్ ఆడడం అలవాటుగా మారింది. ఆన్ లైన్ రమ్మీ ఆడుతూ..అందులో డబ్బులు పెట్టేవాడు. తన దగ్గర ఉన్న డబ్బులు అయిపోవడంతో…ఇతరుల దగ్గర అప్పు చేసేవాడు. ఇలా లక్షలాది రూపాయలు అప్పులు చేశాడు. అందులో పెట్టిన డబ్బు తిరిగి రాకపోవడం, అప్పు ఇచ్చిన వాళ్లు వత్తిడి తేవడంతో మానసికంగా కృంగిపోయాడు మోహన్.
Read More : Tokyo Olympics : సెమీస్ పోరులో భజరంగ్ పూనియాకు పరాజయం
తీవ్రమైన ఒత్తిడి రావడంతో..ఆత్మహత్యే శరణ్యమని కుటుంబం భావించింది. 2021, ఆగస్టు 06వ తేదీ శుక్రవారం తల్లి, భార్య, కొడుకులు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. అనంతరం మోహన్ సినీ పక్కీలో ముఖానికి ప్లాస్టిక్ కవర్ చుట్టుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలో కలకలం రేపుతోంది. ఆన్ లైన్ గేమ్స్ ఆడుతూ..జీవితాలు నాశనం అవుతున్నాయని, వెంటనే గేమ్స్ ను నిషేధించాలనే డిమాండ్ వినిపిస్తున్నాయి.