Faridabad Woman Case: కోడలిని చంపి ఇంటి ముందు గొయ్యిలో పూడ్చిన కేసులో సంచలన విషయాలు.. హత్యకు ముందు బరితెగించిన మామ
దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు జేసీబీతో గొయ్యిని తవ్వించగా 10 అడుగుల లోతున తన్నూ మృతదేహం బయటపడింది.

Faridabad Woman Case: హర్యానాలో అదనపు కట్నం కోసం కోడలిని చిత్ర హింసలు పెట్టి చంపి ఇంటి ముందు పెద్ద గొయ్యి తీసి పూడ్చిన కేసు దర్యాఫ్తులో విస్తుగొలిపే విషయాలు వెలుగులోకి వచ్చాయి. కోడలి హత్యకు ముందు ఆమె మామ లైంగిక దాడి చేశాడని తేలింది.
హర్యానాలోని ఫరీదాబాద్‌లో ఈ దారుణం జరిగింది. ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్ జిల్లాకు చెందిన తన్నూకి, ఫరీదాబాద్‌కు చెందిన అరుణ్‌సింగ్‌తో రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. పెళ్లైన కొన్ని రోజులకే తన్నూకి వేధింపులు మొదలయ్యాయి. అదనపు కట్నం కోసం భర్త, అత్తమామలు వేధించారు. దీంతో ఆమె పుట్టింటికి వచ్చేసింది.
ఆ తర్వాత పెద్దల జోక్యంతో ఏడాది క్రితం తిరిగి భర్త దగ్గరికి వెళ్లింది. ఈ క్రమంలో 2 నెలల క్రితం తన్నూ మానసిక వ్యాధితో బాధపడుతోందని, ఇంటి నుంచి పారిపోయిందని ఆమె అత్తమామలు ప్రచారం చేశారు. కోడలు కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. విషయం తెలిసిన తన్నూ తండ్రి హకీమ్ ఫిరోదాబాద్‌లోని అల్లుడి ఇంటికి వెళ్లాడు.
Also Read: విజయవాడలో రూ.300 కోట్ల మోసం.. బాధితుల్లో ఐఏఎస్ లు, ఐపీఎస్ లు కూడా..! స్కామ్ జరిగిందిలా..
ఈ క్రమంలో ఇంటి ముందు పెద్ద గొయ్యి తీసి పూడ్చినట్టు ఉండటంతో అనుమానించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు జేసీబీతో గొయ్యిని తవ్వించగా 10 అడుగుల లోతున తన్నూ మృతదేహం బయటపడింది. బాధితురాలి భర్త అరుణ్‌సింగ్‌తోపాటు ఆమె అత్తమామలు, ఆడపడుచును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కోడలు తన్నును ఆమె అత్తమామలు చంపి ఇంటి ముందు పాతిపెట్టారు. తర్వాత ఏమీ తెలియనట్లు నాటకం ఆడారు. కోడలు కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాదాపు రెండు నెలల తర్వాత తన్నూ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు.
కోడలి హత్య ముందస్తు ప్రణాళికతో జరిగిందని మామ భూప్ సింగ్ పోలీసుల విచారణలో వెల్లడించినట్లు సమాచారం. ఏప్రిల్ 21 రాత్రి అరుణ్ తన భార్య తన్ను, సోదరి కాజల్ ఆహారంలో నిద్రమాత్రలు కలిపి ఇచ్చాడు. ఇద్దరూ వేర్వేరు గదుల్లో నిద్రపోయారు. ఆ రాత్రే తన్నూని చంపాలని భూప్ సింగ్ నిర్ణయించుకున్నాడు.
భూప్ సింగ్ అర్థరాత్రి తన్ను గదిలోకి ప్రవేశించాడు. దుపట్టాతో ఆమె గొంతు బిగించి చంపడానికి సిద్ధమయ్యాడు. అప్పటికే స్పృహ కోల్పోయిన కోడలిని చూసి అతడు దారుణానికి ఒడిగట్టాడు. ఆమెను చంపే ముందు లైంగిక దాడి చేశాడు. ఆ తర్వాత ఆమెను చంపేశాడు. కొంత సమయం తర్వాత అతను అరుణ్‌ను పిలిచాడు. ఇద్దరూ కలిసి మృతదేహాన్ని బయటకు తీసుకొచ్చారు. ఇంటి ముందు అప్పటికే తవ్విన గుంతలో పడేశారు. దాని పైన ఇటుకలు పేర్చి, మట్టిని పోశారు. కాగా, ఆ గుంత మురుగునీరు పారే కోసం తీసిందని ఇంటి చుట్టుపక్కల వారిని నమ్మించారు.
తన్నూ భర్త అరుణ్, మామ భూప్ సింగ్, అత్త సోనియా, అరుణ్ సోదరి కాజల్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. తన కుమార్తెను అత్తమామలు కట్నం కోసం నిరంతరం వేధించారని మృతురాలి తండ్రి కన్నీటిపర్యంతం అయ్యారు. పెళ్లైన ఏడాది పాటు తన కూతురు పుట్టింట్లోనే ఉండాల్సి వచ్చిందని వాపోయారు. పెద్దల పంచాయితీతో ఆమె తిరిగి భర్త దగ్గరికి వెళ్లిందన్నారు.