వీర్వోకి 4సార్లు పార్టీ ఇచ్చినా, రూ.20వేలు లంచమిచ్చినా పని కాలేదు : రెవెన్యూ సిబ్బందిపై పెట్రోల్ పోసిన రైతు
అధికారుల తీరుతో విసుగు చెందే చిగురుమామిడి ఎమ్మార్వో ఆఫీస్ లో పెట్రోల్ పోశానని రైతు కనకయ్య చెప్పాడు. కొత్త పాస్ బుక్ కోసం వీఆర్వో హనుమంతుకు 4 సార్లు పార్టీ ఇచ్చాను

అధికారుల తీరుతో విసుగు చెందే చిగురుమామిడి ఎమ్మార్వో ఆఫీస్ లో పెట్రోల్ పోశానని రైతు కనకయ్య చెప్పాడు. కొత్త పాస్ బుక్ కోసం వీఆర్వో హనుమంతుకు 4 సార్లు పార్టీ ఇచ్చాను
అధికారుల తీరుతో విసుగు చెందే చిగురుమామిడి ఎమ్మార్వో ఆఫీస్ లో పెట్రోల్ పోశానని రైతు కనకయ్య చెప్పాడు. కొత్త పాస్ బుక్ కోసం వీఆర్వో హనుమంతుకు 4 సార్లు పార్టీ ఇచ్చాను అన్నాడు. అంతేకాదు రూ.20వేలు లంచం కూడా ఇచ్చినట్టు తెలిపాడు. అయినా పాస్ బుక్ జారీ చేయ్యలేదని, దీంతో వీఆర్వో మీద పెట్రోల్ పోసేందుకు వెళ్లానని కనకయ్య తెలిపాడు. అయితే ఆ సమయంలో వీఆర్వో లేకపోవడంతో ఆఫీస్ లో పెట్రోల్ చల్లానని వివరించాడు. పాస్ బుక్ కోసం 2 నెలలు తనను తిప్పుకున్నారని వీఆర్వోపై రైతు కనకయ్య మండిపడ్డాడు.
కరీంనగర్ జిల్లా చిగురుమామిడి తహసీల్దార్ ఆఫీస్ లో మంగళవారం(నవంబర్ 19,2019) పెట్రోల్ దాడి ఘటన కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. పట్టా పాసు పుస్తకంలో తన పూర్తి భూమి నమోదు కాలేదని ఆగ్రహించిన ఓ రైతు సిబ్బందిపై పెట్రోల్‌తో దాడి చేశాడు. అగ్గి పుల్ల అంటించేలోపే సిబ్బంది అప్రమత్తమై అడ్డుకోవడంతో ప్రమాదం తప్పింది. మండలంలోని లంబాడిపల్లికి చెందిన జీల కనకయ్యకు గ్రామంలోని సర్వే నంబర్ 1142, 1145, 1146లో 4.19 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది.
అందులో 0.19 గుంటలు మాత్రమే పట్టాదారు పాసు పుస్తకంలో నమోదైంది. మిగతా 4.0 ఎకరాల కోసం ఏడాదిగా కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాడు. పాసు పుస్తకం లేనిదే వరి ధాన్యాన్ని తూకం వేయడం లేదని రెండ్రోజుల క్రితం వీఆర్‌ఓ సంప్రదించగా.. 4.19 ఎకరాలకు ధ్రువీకరణ పత్రం రాసిచ్చాడు.
సింగిల్ విండో అధికారికి చూపించగా.. ఇది చెల్లదని చెప్పడంతో రైతు కనుకయ్య ఆగ్రహం వ్యక్తం చేశాడు. మంగళవారం తహసీల్దార్‌ను రెండుసార్లు కలిసేందుకు ప్రయత్నించగా.. గేటు దగ్గర వీఆర్‌ఏ అడ్డుకున్నాడు. దీంతో బయటకు వెళ్లిన కనకయ్య 2 లీటర్ల పెట్రోల్ తీసుకొచ్చి సీనియర్ అసిస్టెంట్ రాంచందర్‌రావు, వీఆర్‌ఏలు నర్స య్య, అనిత, అటెండర్ దివ్యలపై పోశాడు. అగ్గి పెట్టె తీసేలోపే సిబ్బంది కనకయ్యను బయటకు లాక్కెళ్లారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.