ప్రాణం తీసిన ఆమ్లెట్ గొడవ

ప్రాణం తీసిన ఆమ్లెట్ గొడవ

Updated On : February 8, 2021 / 5:08 PM IST

fighting for omelette, man dies on attack : వైన్ షాపు వద్ద ఆమ్లెట్ తీసుకురావటానికి జరిగిన రూ. 60 ల గొడవలో ఒక నిండు ప్రాణం బలైన ఘటన హైదరాబాద్ ఉప్పల్ లో జరిగింది. లంగర్ హౌస్ కు చెందిన వికాస్ (35) ప్రైవేట్ సంస్ధలో ఉద్యోగం చేస్తున్నాడు. తన స్నేహితుడు బబ్లూను కలవటానికి ఆదివారం సాయంత్రం పిర్జాదీగూడ వచ్చాడు.

అక్కడ్నించి ఇద్దరూ కలిసి మద్యం సేవించటానికి ఉప్పల్ లోని మహంకాళి వైన్స్ కు వెళ్లారు. అక్కడ పర్మిట్ రూం లో కూర్చుని మద్యం సేవిస్తూ ఆమ్లెట్ తీసుకరమ్మనమని ఆర్డర్ చెప్పారు. రూ.60 ఇవ్వాలని దుకాణ నిర్వాహకుడు వికాస్ ను డబ్బులు అడిగాడు. ఈ విషయమై ఇద్దరికీ వాగ్వాదం జరిగింది.

ఈ క్రమంలో కొపోదిక్తుడైన దుకాణం యజమాని అక్కడున్న తన సిబ్బందితో వికాస్, బబ్లూలపై పై దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన వికాస్ అక్కడికక్కడే చనిపోయాడు. సమాచారం తెలుసుకున్న ఉప్పల్ పోలీసులు ఘటనా స్ధలానికి చేరుకుని కేసు నమోదు చేసుకని దర్యాప్తు చేస్తున్నారు.