Bandla Ganesh : చెక్ బౌన్స్ కేసులో కోర్టుకు హాజరైన బండ్ల గణేష్

టాలీవుడ్ నిర్మాత బండ్ల గణేష్ చెక్ బౌన్స్ కేసులో ప్రొద్దుటూరు కోర్టుకు నేడు హాజరయ్యాడు. గతంలో ప్రొద్దుటూరుకు చెందిన పలువురు సినీ ఫైనాన్షియర్స్ వద్ద నుంచి దాదాపు పది కోట్ల రూపాయలు

Bandla Ganesh : చెక్ బౌన్స్ కేసులో కోర్టుకు హాజరైన బండ్ల గణేష్

Bandla Ganesh Film Producer

Updated On : March 28, 2022 / 1:25 PM IST

Bandla Ganesh  :  టాలీవుడ్ నిర్మాత బండ్ల గణేష్ చెక్ బౌన్స్ కేసులో ప్రొద్దుటూరు కోర్టుకు నేడు హాజరయ్యాడు. గతంలో ప్రొద్దుటూరుకు చెందిన పలువురు సినీ ఫైనాన్షియర్స్ వద్ద నుంచి దాదాపు పది కోట్ల రూపాయలు డబ్బు తీసుకున్నారు.

ఆ డబ్బును తిరిగి చెల్లించకపోవడంతో సదరు వ్యాపారస్తులు    ప్రొద్దుటూరు సివిల్ సెషన్స్ కోర్టు నందు చెక్ బౌన్స్ కేసులు వేసినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా బండ్ల గణేష్ మాట్లాడుతూ తనపై కావాలనే కేసులు వేశారని తెలిపారు. గతంలో కూడా పలు మార్లు చెక్ బౌన్స్ కేసులో బండ్ల గణేష్ ప్రొద్దుటూరు కోర్ట్ కు హాజరయ్యాడు.

Also Read : Tinder app : కారు లిఫ్ట్ కోసం డేటింగ్ నాటకమాడిన యువతి