ఫుడ్ డెలివరీ బాయ్ వెకిలీ చేష్టలు.. కస్టమర్ ఫోన్‌కు అశ్లీల మెసేజ్‌లు

ఫుడ్ డెలివరీ బాయ్ వెకిలీ చేష్టలు.. కస్టమర్ ఫోన్‌కు అశ్లీల మెసేజ్‌లు

Updated On : October 11, 2020 / 10:45 AM IST

Online యాప్‌ ద్వారా ఆహార పదార్థాల ఆర్డర్ చేసిన మహిళకు మొబైల్‌ ఫోన్‌లో అశ్లీల మెసేజ్‌లు, పిక్చర్లు పంపి వేధించడం మొదలుపెట్టాడు ఓ Food delivery boy. ఆ ప్రబుద్ధుడు చేసిన వెకిలి చేష్టలు పోలీసుల వరకూ చేరడంతో ఎస్‌ఆర్‌నగర్‌ పోలీసులు కేసు ఫైల్ చేశారు. అమీర్‌పేట తూర్పు శ్రీనివాస్‌నగర్‌ కాలనీకి చెందిన మహిళ సెప్టెంబర్ 31న మొబైల్‌ యాప్‌లోని Rapido బైక్‌ టాక్సీ ద్వారా ఫుడ్‌ ఆర్డర్‌ చేసింది.

రవి అనే డెలివరీ బాయ్‌ వాటిని తీసుకువచ్చాడు. పేమెంట్ గూగుల్ పే ద్వారా చేస్తానని చెప్పి.. సక్సెస్ అయిన ట్రాన్సాక్షన్ స్క్రీన్ షాట్‌ను రవి సెల్‌ ఫోన్‌కు వాట్సప్ చేసింది. కస్టమర్ నెంబర్ సేవ్ చేసుకున్న రవి.. మూడు రోజుల తరువాత నుంచి మహిళ ఫోన్‌కు అశ్లీల చిత్రాలు, వీడియోల సందేశాలను పంపడం మొదలుపెట్టాడు.



దాని నుంచి బయటపడటానికి అతడి నెంబర్ ను బ్లాక్ చేసింది. అక్కడితో ఆగకుండా మరో సెల్‌ నంబర్‌ నుంచి వేధింపులు కొనసాగించాడు. బాధిత మహిళ పోలీసులకు కంప్లైంట్ చేసింది. కేసు నమోదు చేసుకుని పరారీలో ఉన్న రవి కోసం గాలిస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్‌ సైదులు వివరించారు.