తీవ్ర విషాదాన్ని నింపిన పండుగ ప్రయాణం

సంక్రాంతి పండుగ ఓ బాలికను తిరిగిరాని లోకాలకు పంపించింది. ఓ కుటుంబానికి తీరని శోకాన్ని మిగిల్చింది. అమ్మా పండుక్కి వెళ్తున్నానని సంబరంగా వెళ్లిన ఆ బాలిక శవమై తిరిగొచ్చింది.

  • Published By: veegamteam ,Published On : January 18, 2019 / 10:18 AM IST
తీవ్ర విషాదాన్ని నింపిన పండుగ ప్రయాణం

Updated On : January 18, 2019 / 10:18 AM IST

సంక్రాంతి పండుగ ఓ బాలికను తిరిగిరాని లోకాలకు పంపించింది. ఓ కుటుంబానికి తీరని శోకాన్ని మిగిల్చింది. అమ్మా పండుక్కి వెళ్తున్నానని సంబరంగా వెళ్లిన ఆ బాలిక శవమై తిరిగొచ్చింది.

కృష్ణాజిల్లా: సంక్రాంతి పండుగ ఓ బాలికను తిరిగిరాని లోకాలకు పంపించింది. ఓ కుటుంబానికి తీరని శోకాన్ని మిగిల్చింది. అమ్మా పండుక్కి వెళ్తున్నానని సంబరంగా వెళ్లిన ఆ బాలిక శవమై తిరిగొచ్చింది. జగ్గయ్యపేట మండలం బండిపాలెం గ్రామానికి చెందిన నెల్లూరి నరేంద్ర పెద్ద కుమార్తె తరుణి (7) నాయనమ్మ ఈశ్వరమ్మతో కలిసి గౌరవరం గ్రామంలో బంధువుల ఇంటికి పండగకు వెళ్ళి వస్తుండగా తిరుగు ప్రయాణంలో గౌరవరం నుంచి బస్సులో కొణకంచి క్రాస్‌ రోడ్స్‌ వద్ద దిగి ఈశ్వరమ్మ మనమరాలు తరుణి చేయి పట్టుకొని బండిపాలెం వెళ్లేందుకు రోడ్డు దాటుతోంది. అదే సమయంలో విజయవాడ నుంచి హైదరాబాద్‌ వైపు వేగంగా వెళ్తున్న కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తరుణి అక్కడికక్కడే మృతి చెందింది. అప్పటి వరకు చేయి పట్టుకొని నడిచిన మనుమరాలు మృతి చెందటంతో ఘటనా స్థలంలో నాయనమ్మ బోరున విలపిస్తున్న తీరు అందరినీ కలచివేసింది. ఈ ఘటన మండల పరిధిలోని కొణకంచి క్రాస్‌రోడ్స్‌ వద్ద గురువారం సాయంత్రం చోటు చేసుకుంది.