సీఆర్ పీఎఫ్ జవాన్లే లక్ష్యంగా గ్రెనేడ్ దాడి

శ్రీనగర్ : జమ్మూకాశ్మీర్ లో తీవ్రవాదులు మళ్లీ విరుచుకపడ్డారు. గ్రెనేడ్ దాడికి పాల్పడ్డారు. సీఆర్ పీఎఫ్ జవాన్లే లక్ష్యంగా పుల్వామా ఎస్ బీఐ సమీపంలో గ్రెనేడ్ దాడి జరిగింది. ఒక జవాన్ కు గాయాలు అయ్యాయి. అతన్ని సమీప ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తున్నారు. తీవ్రవాదుల కోసం భద్రతా బలగాలు విస్తృతంగా గాలిస్తున్నాయి.
ఫిబ్రవరి 14వ తేదీన పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో 40 మంది సైనికులు అమరులైన సంగతి తెలిసిందే. సీఆర్ పీఎఫ్ కాన్వాయ్ లక్ష్యంగా ఆత్మాహుతి దాడి జరిగింది. ఓ వాహనంలో పేలుడు పదార్థాలు నింపుకుని జవాన్ల కాన్వాయ్ పై దాడి చేశారు. ఈ సంఘటన దేశాన్ని కదిలించింది. ఆ తర్వాత భద్రతను కట్టుదిట్టం చేశారు.