గన్ ఫర్ సేల్: ఇద్దరి అరెస్టు
హైదరాబాద్ లో అక్రమంగా ఆయధాలు అమ్ముతున్న మహారాష్ట్రకు చెందిన ఇద్దరు వ్యక్తులను రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు.

హైదరాబాద్ లో అక్రమంగా ఆయధాలు అమ్ముతున్న మహారాష్ట్రకు చెందిన ఇద్దరు వ్యక్తులను రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు.
హైదరాబాద్: నగరంలో చిన్న చితకా రౌడీలు కూడా ఆయుధాలతో హల్ చల్ చేస్తున్నారు. ఛోటా మోటా గ్యాంగ్ స్టర్స్ కూడా పిస్టల్స్ తో విరుచుకు పడుతున్నారు. పిస్టల్ చూపించి అక్రమ వసూళ్లుకు పాల్పడే వారు కొందరు. ఇలాంటి వారికి పిస్టల్స్ సరఫరా చేసే ఇద్దరు వ్యక్తును నగర పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే ….
నగరంలో ఆయుధాల అక్రమ రావాణా చేస్తున్న ఇద్దరిని ఎల్బీ నగర్ పోలీసులు ఇటీవల అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి రెండు తుపాకులు, రెండు రౌండ్లు బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. మహారాష్ట్ర భివాండీకి చెందిన దత్తు శ్యాంసుందర్ అనేవారు ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన జాంషీర్ వద్ద పిస్టల్స్ కొన్నారు. వీటిని అమ్మేందుకు హైదరాబాద్ చేరుకుని ఎల్బీనగర్ లోని ఒక లాడ్జిలో బస చేయగా, విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు లాడ్జి పై దాడి చేసి వారిని అరెస్టుచేశారు.
లోకల్ మేడ్ పిస్టల్స్ కు మేడిన్ యూఎస్,యూకే పేర్లు ముద్రించి ఒక్కో తుపాకీని లక్ష రూపాయలకు అమ్ముతున్నట్లు పోలీసులు తెలిపారు. వీరికి తుపాకులు అమ్మిన జాంషీర్ ను అరెస్టు చేసేందుకు స్పెషల్ టీంను ఏర్పాటు చేసినట్లు రాచకొండ సీపీ మహేష్ భగవత్ శుక్రవారం తెలిపారు. వీరు నగరంలో ఎవరికి పిస్టల్స్ అమ్మటానికి వచ్చారనే విషయంపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.