Dating App : డేటింగ్ యాప్‌లో పరిచయం…మహిళపై అత్యాచారం
డేటింగ్ యాప్ ఓ మహిళ కొంప ముంచిన ఘటన గురుగ్రామ్ నగరంలో తాజాగా వెలుగుచూసింది. గురుగ్రామ్ నగరానికి చెందిన ఓ మహిళకు డేటింగ్ యాప్ ద్వారా ఓ యువకుడు పరిచయం అయ్యాడు. ఇద్దరు యవకులు తనపై అత్యాచారం చేసి వీడియో తీశారని మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది....

Dating App
Dating App : డేటింగ్ యాప్ ఓ మహిళ కొంప ముంచిన ఘటన గురుగ్రామ్ నగరంలో తాజాగా వెలుగుచూసింది. గురుగ్రామ్ నగరానికి చెందిన ఓ మహిళకు డేటింగ్ యాప్ ద్వారా ఓ యువకుడు పరిచయం అయ్యాడు. ఆ పరిచయంతో మహిళను (Gurugram woman) గురుగ్రామ్ సెక్టారు 50 ప్రాంతంలోని హోటల్ గదికి రమ్మని యువకుడు ఆహ్వానించాడు. (she met on Dating App) హోటల్ గదికి వచ్చిన మహిళకు ఇద్దరు యువకులు భోజనం పెట్టారు.
Indian Woman Anju love story : పాకిస్థానీతో అంజూ వివాహం…ఆమె తండ్రి ఏం చెప్పారంటే…
భోజనంలో మత్తుమందు కలపడంతో అది తిన్న మహిళ మత్తులోకి జారుకుంది. దీన్ని ఆసరాగా తీసుకొని ఇద్దరు యవకులు తనపై అత్యాచారం చేసి వీడియో తీశారని మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. స్పృహ వచ్చాక మహిళ నిరసన తెలిపితే అత్యాచారం వీడియోను వైరల్ చేస్తామని బెదిరించారు. దీంతో బాధతురాలు ఇంటికి తిరిగివచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అపరిచిత యువకులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని గురుగ్రామ్ పోలీసులు చెప్పారు.