సూత్రధార్‌లో వికృత చేష్టలు : దుస్తులు తీసేస్తేనే నటన నేర్పిస్తా
హైదరాబాద్ లో దారుణం వెలుగుచూసింది. యాక్టింగ్ స్కూల్ పేరుతో లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. దుస్తులు తీసేస్తేనే నటన నేర్పిస్తానని యువతులను వేధించాడు.

హైదరాబాద్ లో దారుణం వెలుగుచూసింది. యాక్టింగ్ స్కూల్ పేరుతో లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. దుస్తులు తీసేస్తేనే నటన నేర్పిస్తానని యువతులను వేధించాడు.
హైదరాబాద్ లో దారుణం వెలుగుచూసింది. యాక్టింగ్ స్కూల్ పేరుతో లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. దుస్తులు తీసేస్తేనే నటన నేర్పిస్తానని యువతులను వేధించాడు. హిమాయత్ నగర్ లోని సూత్రధార్ యాక్టింగ్ ఇన్ స్టిట్యూట్ లో లైంగిక వేధింపులు వెలుగుచూశాయి. ఇన్ స్టిట్యూట్ డైరెక్టర్ వినయ్ తనను లైంగికంగా వేధించాడని ఓ యువతి ఆరోపించింది. దుస్తులు తీసేస్తేనే నటన నేర్పుతానని చెప్పాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనతో పాటు 8మంది యువతులకు ఇలాంటి వేధింపులే ఎదురయ్యాయని పోలీసులతో చెప్పింది. వినయ్ బారి నుంచి వారిని కాపాడాలని పోలీసులను కోరింది.
Also Read : సంచలనం : టిక్ టాక్ యాప్ బ్లాక్ చేసిన గూగుల్
డైరెక్టర్ వినయ్ ని అరెస్ట్ చెయ్యాలని, కఠినంగా శిక్షించాలని బాధితురాలు డిమాండ్ చేసింది. తనలాంటి బాధితులు ఇంకా ఉన్నారని, వారు ఫిర్యాదు చెయ్యడానికి బయటకు రాలేదని, తాను మాత్రం ధైర్యంగా బయటకు వచ్చానని ఆ యువతి తెలిపింది. పూర్తి స్తాయి విచారణ జరిపితే ఇన్ స్టిట్యూట్ లో ఏం జరుగుతోందో తెలుస్తుందని చెప్పింది.
ఈ కేసుని పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. యాక్టింగ్ స్కూల్ కి సంబంధించిన వివరాలను సేకరిస్తున్నారు. వినయ్ ని అదుపులోకి తీసుకుని అతడి స్టేట్ మెంట్ తీసుకున్నారు. వినయ్ మాత్రం తనపై వచ్చిన ఆరోపణలను ఖండించాడు. తనను, తన ఇన్ స్టిట్యూట్ ప్రతిష్టను దెబ్బతీసేందుకు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని వాపోయాడు. యాక్టింగ్ నేర్పే విషయంలో తాను కొన్ని అంశాల్లో కఠినంగా ఉంటాను అని చెప్పాడు. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు నిజానిజాలు రాబట్టే పనిలో ఉన్నారు. ఆరోపణలు నిజమా కాదా అనేది త్వరలోనే తేలుస్తామన్నారు. వినయ్ లైంగిక వేధింపులు నిజమే అయితే అతడిని కఠినంగా శిక్షిస్తామన్నారు.
Also Read : గూగుల్ Trends : TikTok యాప్ కోసం తెగ వెతికేస్తున్నారు