కూతుర్ని రేప్ చేసిన HIV వ్యక్తికి జీవిత ఖైదు

కుమార్తెపై లైంగిక దాడికి పాల్పడి, ఆమెకు ఎయిడ్స్ రావడానికి కారణమైన తండ్రికి 4జీవిత ఖైదులను విధిస్తూ తంజావూరు మహిళా కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. చనిపోయేంత వరకూ నిందితిడిని జైల్లో ఉంచాలని ఆదేశించింది. 2017 నుంచి విచారణ సాగుతున్న ఈ కేసుపై తుది తీర్పును తంజావూరు మహిళా కోర్టు మంగళవారం వెల్లడించింది.
తమిళనాడులోని తంజావూరు జిల్లాకు చెందిన కుమార్ కార్మికుడు. అతడి భార్య మృతి చెందింది. అతడి పదేళ్ల కుమార్తె స్థానిక పాఠశాలలో చదువుతుండేది. ఆ బాలిక ప్రవర్తనలో మార్పులు గమనించిన ఉపాధ్యాయులు ఆమెను విచారించారు. తన తండ్రి మద్యం మత్తులో ఏడాదిగా తరచూ లైంగిక దాడికి పాల్పడుతున్నట్లు ఆమె తెలిపింది.
దీంతో ఉపాధ్యాయులు చైల్డ్ లైన్ సంస్థకు సమాచారామిచ్చి.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. కుమార్ ను పోలీసులు అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. మరో వైపు హాస్టల్ లో ఉన్న ఆ బాలిక అకస్మాత్తుగా అస్వస్థతకు గురి కావడంతో పరీక్షించిన వైద్యులు ఆమెకు హెచ్ఐవీ ఉన్నట్లు గుర్తించారు.
అనంతరం ఆమె తండ్రి కుమార్ కు పరీక్షలు చేయగా అతడికి సైతం ఉన్నట్లు తేలింది. దీంతో తండ్రి నుంచి బాలికకు ఈ వ్యాధి సోకినట్లు నిర్దారణ అయింది. అతనిపై పోస్కో చట్టం కింద జీవిత ఖైదు విధించారు. అంతేకాకుండా బాలిక ట్రీట్మెంట్ కోసం రూ.5లక్షలు మంజూరు చేయాలని ప్రభుత్వానికి సూచించారు.