ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం- బస్టాండ్ లో మహిళ మృతి

ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం- బస్టాండ్ లో మహిళ మృతి

Updated On : December 20, 2020 / 1:32 PM IST

Hospital staff negligency, woman died in bhadrachalam bus stand :  ప్రభుత్వ ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా మహిళ మృతి చెందిన ఘటన భద్రాది కొత్తగూడెం జిల్లాలో చోటు చేసుకుంది. కొత్తగూడెంకు చెందిన సమ్మయ్య బార్య రమ(60) కు అనారోగ్యంగా ఉండటంతో శనివారం మధ్యాహ్నం 3 గంటలసమయంలో ఆమెను తీసుకుని భద్రాచలం ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చాడు. అయితే ఆస్పత్రి సిబ్బంది …ఇప్పడు టైమ్ అయిపోయిందని, రేపు ఆదివారం కనుక సోమవారం ఉదయం రమ్మనమని చెప్పి, వైద్యం చేయకుండా పంపించి వేశారు.

చేసేదేమి లేక సమ్మయ్య భార్యను తీసుకుని తిరిగి భద్రాచలం బస్టాండ్ కు తిరిగి వచ్చాడు. కొత్తగూడెం వెళ్లే బస్సు ఎక్కే సమయంలో రమ కన్ను మూసింది. దీంతో బస్సు ఎక్కించుకునేందుకు ఆర్టీసీ సిబ్బంది నిరాకరించారు. దీంతో భార్య మృతదేహంతోనే సమ్మయ్య ఆర్టీసీ బస్టాండ్ లో రాత్రంతా పడిగాపులు కాచాడు. వైద్య సిబ్బంది నిర్లక్ష్యం వల్లే తన భార్య మరణించిందని సమ్మయ్య వాపోయాడు.